OPPO K13x 5G | తక్కువ బడ్జెట్లోనే ప్రీమియం ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనాలని చూస్తున్నారా..? అయితే మీ కోసమే ఒప్పో కంపెనీ లేటెస్ట్గా ఓ స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. కె13ఎక్స్ 5జి పేరిట కె సిరీస్‌లో ఒప్పో కంపెనీ ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను భారత మార్కెట్లో లేటెస్ట్గా విడుదల చేసింది. ఇందులో మిలిటరీ గ్రేడ్ నాణ్యతను అందిస్తున్నారు. అందువల్ల ఫోన్ చాలా దృఢంగా ఉంటుంది. ఎలాంటి వాతావరణ పరిస్థితిలో అయినా సరే తట్టుకునే విధంగా ఈ ఫోన్‌ను రూపొందించారు. తీవ్రమైన వేడి, తేమ, షాక్‌ను సైతం ఈ ఫోన్ తట్టుకుంటుంది. ఈ ఫోన్‌కు గాను ఐపీ65 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్‌ను కూడా అందిస్తున్నారు. ఇక ఇందులో ఉన్న ఇతర ఫీచర్లు కూడా ఆకట్టుకునే విధంగానే ఉన్నాయి.
ఈ ఫోన్లో 6.67 ఇంచుల డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది హెచ్డీ ప్లస్ రిజల్యూషన్‌ను, 120 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను అందిస్తుంది. ఫోన్ డిస్ ప్లే క్వాలిటీగా ఉంటుందని చెప్పవచ్చు. సూర్యకాంతిలోనూ ఫోన్ డిస్ ప్లే స్పష్టంగా కనిపించేలా 1000 నిట్స్ వరకు పీక్ బ్రైట్నెస్ను ఇందులో అందిస్తున్నారు. చేతులు తడిగా ఉన్నా సరే డిస్ప్లేను చాలా సులభంగా టచ్ చేసి ఆపరేట్ చేసే విధంగా ఈ ఫోన్‌ను రూపొందించారు. ఇందులో ఆండ్రాయిడ్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ వినియోగదారులకు లభిస్తుంది. దీనికిగాను 2 ఓఎస్ అప్డేట్స్ను, 3 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ తెలియజేసింది.
ఈ ఫోన్లో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఏర్పాటు చేశారు. 8జీబీ వరకు ర్యామ్ లభిస్తుంది. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాను ఏర్పాటు చేయగా మరో 2 మెగాపిక్సల్ పోర్ట్రెయిట్ కెమెరా కూడా ఉంది. ముందు వైపు 8 మెగాపిక్సల్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్లో 6000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ ఉన్న బ్యాటరీని ఏర్పాటు చేయగా దీనికి 45 వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌ను అందిస్తున్నారు. ఈ ఫోన్‌తోపాటు బాక్సులో ఫాస్ట్ చార్జర్ కూడా లభిస్తుంది. 4జీబీ, 6జీబీ, 8జీబీ ర్యామ్, 128జీబీ, 256జీబీ స్టోరేజ్ మోడల్స్‌లో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఈ ఫోన్లో ఉన్న ర్యామ్‌ను వర్చువల్‌గా మరో 8జీబీ వరకు పెంచుకునే సదుపాయం కల్పించారు. మెమొరీని కార్డు ద్వారా 1టీబీ వరకు పెంచుకోవచ్చు. హైబ్రిడ్ డ్యుయల్ సిమ్ స్లాట్‌ను ఈ ఫోన్లో ఇచ్చారు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఈ ఫోన్‌కు పక్క భాగంలో ఉంటుంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ కూడా లభిస్తుంది. బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి ఇతర ఫీచర్లు కూడా ఈ ఫోన్లో ఉన్నాయి. ఒప్పో కె13ఎక్స్ స్మార్ట్ ఫోన్ మిడ్ నైట్ వయోలెట్, సన్‌సెట్ పీచ్ కలర్ ఆప్షన్లలో లాంచ్ కాగా ఈ ఫోన్‌కు చెందిన 4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్‌ను రూ.11,999 ధరకు అందిస్తున్నారు. అలాగే 6జీబీ ర్యామ, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.12,999 ఉండగా, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.14,999గా ఉంది. ఈ ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌తోపాటు ఒప్పో ఇండియా ఆన్లైన్ స్టోర్‌లో ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం నుంచి విక్రయించనున్నారు. లాంచింగ్ సందర్భంగా ఈ ఫోన్‌పై రూ.1000 డిస్కౌంట్‌ను పలు బ్యాంకుల కార్డులతో అందిస్తున్నారు. 3 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని సైతం అందిస్తున్నారు.