OnePlus Nord 2 : మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్..
మళ్లీ పేలిన వన్‌ప్లస్ నోర్డ్ 2 స్మార్ట్‌ఫోన్ | వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మరోసారి పేలింది. ఇప్పటికే వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్లు పలుసార్లు పేలిన ఘటనలను మనం చూశాం. తాజాగా మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్టు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. పేలిన ఫోన్ ఫోటోలను కూడా పోస్ట్‌లో జతపరిచాడు. ఫోన్ జీన్స్ జేబులో ఉన్న సమయంలో
వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ స్మార్ట్‌ఫోన్ మరోసారి పేలింది. ఇప్పటికే వన్‌ప్లస్ నోర్డ్ 2 ఫోన్లు పలుసార్లు పేలిన ఘటనలను మనం చూశాం. తాజాగా మహారాష్ట్రలో ఈ ఘటన జరిగినట్టు ఓ ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేశాడు. పేలిన ఫోన్ ఫోటోలను కూడా పోస్ట్‌లో జతపరిచాడు. ఫోన్ జీన్స్ జేబులో ఉన్న సమయంలో పేలడంతో ఆ వ్యక్తి తొడ ప్రాంతంలో తీవ్ర గాయాలు అయినట్టు ఆ యూజర్ ట్విట్టర్లో తెలిపాడు.

ట్విట్టర్లో పోస్ట్ చేయగానే.. వన్‌ప్లస్ కస్టమర్ సపోర్ట్ వెంటనే ట్విట్టర్లో స్పందించింది. దీనికి సంబంధించిన డైరెక్ట్‌గా మెసేజ్ చేసి వివరాలు తెలుపాలని కోరింది. ఏది ఏమైనా.. ఇలా జేబులో పెట్టుకున్న సమయంలో కూడా ఫోన్లు ఇలా పేలిపోవడంతో స్మార్ట్‌ఫోన్‌ను ఉపయోగించాలంటేనే కొందరు యూజర్లు భయపడుతున్నారు.
వన్‌ప్లస్ ఇటీవలే నోర్డ్ 2 సిరీస్‌లో పాక్ మాక్ ఎడిషన్ ఫోన్‌ను రిలీజ్ చేసింది. గత జులై నెలలో వన్‌ప్లస్ నోర్డ్ 2 5జీ ఫోన్ రిలీజ్ అయింది. వన్‌ప్లస్ నోర్డ్ సిరీస్ తర్వాత వచ్చిన సిరీస్ ఇది. నోర్డ్ 2 సిరీస్ లాంచ్ అయిన 3 నెలల్లోనే ఫోన్లు పేలిన ఘటనలు చాలా జరిగాయి. తాజాగా మరొకటి జరిగింది. దీనిపై అధికారికంగా వన్‌ప్లస్ మాత్రం ఎటువంటి ప్రకటన చేయలేదు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Facebook : పేరు మార్చిన కొన్ని రోజులకే ఫేస్‌బుక్‌కు బిగ్ షాక్..
VPN | వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ ప్రయోజనాలేంటి..?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Unemployees | వేసిందే తక్కువ పోస్టులు.. టీజీపీఎస్సీ ఎదుట నిరుద్యోగుల ఆందోళన.. వీడియో
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

