Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ సంస్థలో ఉద్యోగం చేయాలనుకునేవారికి అవకాశం వచ్చింది. అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడులైంది. అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను కోరుతుంది.
సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) 2026 రిక్రూట్మెంట్లో భాగంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా 327 జూనియర్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. దరఖాస్తు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమైంది. నవంబర్ 15తో ముగుస్తుంది.
పోస్టులు, ఖాళీల వివరాలు (Post-Wise Details)
అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)- 70
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)- 60
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)- 10
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-సివిల్)- 22
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్)- 5
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-మెకానికల్)- 4
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్)- 78
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)- 78

Cwc Posts
అర్హతలు (Qualifications)
అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)- ఏదైనా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిగ్రీ లేదా పోస్ట్‌గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఉత్తీర్ణత.
అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్)- బీఈ, బీటెక్ (అగ్రికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఫుడ్ సైన్స్, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫుడ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ లేదా బయోటెక్నాలజీ) ఉత్తీర్ణత.
అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్)- బీకామ్‌తో పాటు ఫైనాన్స్, అకౌంటింగ్లో మూడేండ్ల అనుభవం లేదా ఏదైనా డిగ్రీతో పాటు సీఏ ఇంటర్, సీఎంఏ ఇంటర్ పూర్తి చేసి ఉండాలి.
అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-సివిల్), అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్-ఎలక్ట్రికల్), అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్- మెకానికల్)- సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణత.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్)- ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్‌లో పరిజ్ఞానం ఉండాలి.
జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్)- బీఎస్సీ (అగ్రికల్చర్, బోటనీ, జువాలజీ, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, ఫుడ్ సైన్స్) లేదా కెమిస్ట్రీతో పాటు కంప్యూటర్ అప్లికేషన్స్, ఎంఎస్ ఆఫీస్‌లో పరిజ్ఞానం ఉండాలి.
వయసు
2026, నవంబర్ 15 నాటికి అభ్యర్థుల వయసు 18 నుంచి 28 ఏండ్లలోపు ఉండాలి. ఓబీసీలకు 3, ఎస్సీ, ఎస్టీలకు 5, దివ్యాంగులు, ఎక్స్సర్వీస్మెన్లకు నిబంధనలకు తగిన వయోపరిమితి సడలింపు ఉంది.
ఎంపిక
అసిస్టెంట్ మేనేజర్ పోస్టులకు ఆన్లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ, జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఆన్లైన్ ఎగ్జామ్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.
పరీక్ష 200 ఆబ్జెక్టివ్ ప్రశ్నలకు 200 మార్కులు, రెండు డిస్క్రిప్టివ్ ప్రశ్నలకు 30 మార్కులు మొత్తం 230 మార్కులకు ఉంటుంది.
పరీక్షలో నెగెటివ్ మార్కింగ్‌లో భాగంగా ప్రతి తప్పు సమాధానికి 1/4వ వంతు మార్కులు తగ్గిస్తారు.
ఫీజు
దరఖాస్తులు ఆన్లైన్లో చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు UR / EWS / OBCలకు రూ. 1350, ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్మెన్లకు రూ. 500.
వేతనం
ఎంపికైనవారికి నెలకు అసిస్టెంట్ మేనేజర్లకు రూ. 40,000 నుంచి రూ. 1,40,000 వరకు, జూనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు రూ. 29,000 నుంచి రూ. 93,000 వరకు ఇస్తారు.
చివరితేదీ
దరఖాస్తు ప్రక్రియ నేటి (అక్టోబర్ 17) నుంచి ప్రారంభమైంది. నవంబర్ 15లోగా దరఖాస్తు చేసుకోవాలి. ఇతర వివరాలకు వెబ్సైట్ www.cewacor.nic.in చూడండి.

Apply Online
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jobs | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్లో 327 అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు
Weight Loss | ఆహారాన్ని ఎక్కువగా తింటూనే బరువును తగ్గించుకోవచ్చా.. అది సాధ్యపడుతుందా.. ఎలా..?
Greater Noida: రాత్రి నూడుల్స్ తిన్నారు.. కుటుంబంలోని అయిదుగురు మృతి
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

