Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Masoud Pezeshkian | తాము అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధమని ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) అన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాము అమెరికా (USA) ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
Masoud Pezeshkian : తాము అణ్వాయుధాలను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధమని ఇరాన్ అధ్యక్షుడు (Iran President) మసూద్ పెజెష్కియాన్ (Masoud Pezeshkian) అన్నారు. ఇరాన్ అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తోందంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా, ఎన్ని బెదిరింపులకు పాల్పడినా తాము అమెరికా (USA) ఒత్తిడికి తలొగ్గే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
జీవవైవిధ్య సదస్సు సందర్భంగా అర్మేనియా రాజధాని యెరెవాన్లో జార్జియా ప్రధాని ఇరాక్లీ కొబాఖిడ్జేతో పెజెష్కియాన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరాన్ అణ్వాయుధాలపై తమ వైఖరిని మరోసారి స్పష్టంచేశారు. అణ్వాయుధాల అభివృద్ధిని నిషేధిస్తూ ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ గతంలో స్పష్టమైన వైఖరి తీసుకున్నారని ఆయన గుర్తుచేశారు. ఇరాన్ ఎప్పుడూ చర్చలకు సిద్ధంగానే ఉందని చెప్పారు.
అయితే తమను లొంగదీసుకోవచ్చని అమెరికా భావిస్తోందని, బలవంతపు చర్యలకు తాము అంగీకరించబోమని పెజెష్కియాన్ స్పష్టంచేశారు. అమెరికా విధిస్తున్న ఆంక్షలు మానవతా సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని విమర్శించారు. ఇరాన్‌పై ఇటీవల అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడులను అన్యాయమైన, అమానవీయ చర్యలుగా వ్యాఖ్యానించారు. ఇతర దేశాల అంతర్గత వ్యవహారాల్లో విదేశీ జోక్యాన్ని తాము వ్యతిరేకిస్తామని జార్జియా ప్రధాని కొబాఖిడ్జే ఈ సందర్భంగా చెప్పారు.
అర్మేనియా ప్రధాని నికోల్ పషిన్యాన్‌తో జరిగిన మరో సమావేశంలోనూ పెజెష్కియాన్ అమెరికాపై విమర్శలు చేశారు. ఇరాన్ లొంగిపోదనే వాస్తవాన్ని అమెరికా గుర్తించాలని అన్నారు. అమెరికా ఆంక్షలు ఇరాన్‌తోపాటు ప్రపంచదేశాలకూ సమస్యలు సృష్టిస్తున్నాయని పేర్కొన్నారు. వాషింగ్టన్ ఇదే విధానాన్ని కొనసాగిస్తే ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మరింత దిగజారతాయని హెచ్చరించారు. బలప్రయోగానికి బదులుగా తర్కబద్ధమైన చర్చలకు అమెరికా ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Masoud Pezeshkian | మేం అణ్వాయుధాల కోసం ప్రయత్నిస్తున్నామనేది పచ్చి అబద్ధం : ఇరాన్ అధ్యక్షుడు
Chittem Rammohan Reddy | రైతు భరోసా అందని రైతుకు భరోసా ఎవరు..?.. కాంగ్రెస్ సర్కారుపై మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నిప్పులు
Oil Price | మళ్లీ పెరిగిన ముడిచమురు ధరలు.. బ్రెంట్ క్రూడ్ ధర ఎంతంటే..!
KTR | నేను ట్రీట్మెంట్ చేయిస్తా.. బ్రెయిన్ క్యాన్సర్‌తో బాధపడుతున్న వినయ్‌కు కేటీఆర్ భరోసా.. వీడియో
Katie Zacharia: వైట్‌హౌజ్ ప్రెస్ సెక్రటరీగా 5 రోజులే.. జాబ్ వదిలేసిన కేట్ జచారియా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

