న్యూఢిల్లీ : వన్‌ప్లస్ నెక్ట్స్ జనరేషన్ ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది ఆరంభంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుండగా ఈ హాట్ డివైజ్‌కు సంబంధించి ఆన్లైన్లో పలు లీక్‌లు వెల్లడయ్యాయి. వన్‌ప్లస్ 11 100డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో కస్టమర్ల ముందుకు రానుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
వన్‌ప్లస్ 11 5000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంటుందని భావిస్తున్నారు. వన్‌ప్లస్ లేటెస్ట్ ఫోన్లో డిజైన్ పరంగా పెద్దగా మార్పులు ఉండవని చెబుతున్నారు. పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్లోనే వన్‌ప్లస్ 11 కస్టమర్ల ముందుకొస్తుంది. వన్‌ప్లస్ 11 స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ఎస్ఓసీ చిప్‌సెట్‌ను యూజ్ చేస్తారు. వేగవంతమైన యాప్ లోడింగ్ కోసం వన్‌ప్లస్ అప్‌కమింగ్ ఫోన్లో ఫాస్టర్ స్టోరేజ్ ఆప్షన్‌ను కంపెనీ ఆఫర్ చేయనుంది.
ఇక వన్‌ప్లస్ ఫోన్ ఐపీ రేటింగ్ లేదా వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌ను కలిగిఉందా అనే వివరాలు వెల్లడికాలేదు. ఇక వన్‌ప్లస్ 11 వచ్చే ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో కస్టమర్ల ముందుకు రానుంది. ఈసారి వన్‌ప్లస్ నుంచి ప్రొ మోడల్‌ను ఆశించడం లేదు. స్టాండర్డ్ వన్‌ప్లస్ 11 వెర్షన్ మాత్రమే ఉంటుందని లీక్స్ వెల్లడించాయి.