గురువారం 03 డిసెంబర్ 2020
Science-technology - Nov 19, 2020 , 17:53:56

ఈ నెల 24న మార్కెట్ లోకి పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్...!

ఈ నెల 24న మార్కెట్ లోకి పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్...!

ఢిల్లీ : చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీ పోకో మార్కెట్ లోకి మరో స్మార్ట్‌ఫోన్ ను ఆవిష్కరించనున్నది. పోకో ఎం3 చేయనున్నట్లు పోకో ప్రకటించింది. నవంబర్ 24న పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో విడుదల కానున్నది. పోకో నుంచి ఇప్పటికే ఎం సిరీస్‌లో పోకో ఎం2, పోకో ఎం2 ప్రో విడుదలవ్వగా.. ఇప్పుడు అదే సిరీస్‌లో మూడో స్మార్ట్‌ఫోన్‌ను "పోకో ఎం3" పేరుతో  మార్కెట్ లోకి ప్రవేశ పెట్టనుంది. పోకో ఎం3 స్మార్ట్‌ఫోన్‌కు ప్రత్యేకతలు, ఫీచర్స్ గురించి కంపెనీ అధికారికంగా మాత్రం వెల్లడించలేదు. విపణిలోకి ఎప్పుడు వస్తుందనే విషయం తెలిపింది. నవంబర్ 24న సాయంత్రం 5.30 గంటలకు వర్చువల్ గా జరిగే ఈవెంట్ లో పోకో ఎం3 ను ఆవిష్కరించనున్నారు.