హూస్టన్: ఎప్పుడో 115 ఏళ్ల కిందట భూమిపై తొలిసారి రైట్ బ్రదర్స్ గాల్లో ఎగిరారు. ఇప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా కూడా మార్స్‌పై అలాంటి ఘనతనే సాధించింది. సౌర కుటుంబంలోని మరో గ్రహంపై తొలిసారి ఒక హెలికాప్టర్ విజయవంతంగా ఎగిరింది. ఈ విషయాన్ని నాసా సోమవారం వెల్లడించింది. పర్సీవరెన్స్ రోవర్‌తో కలిసి మార్స్‌పైకి వెళ్లిన ఇన్‌జెన్యూయిటీ హెలికాప్టర్ తొలిసారి మార్స్‌పై ఎగిరినట్లు నాసా ట్వీట్ చేసింది.
దీనికి సంబంధించిన వీడియోను కూడా నాసా పోస్ట్ చేసింది. మేము కూడా రైట్ బ్రదర్స్ మూమెంట్‌ను సాధించామంటూ నాసా కామెంట్ చేయడం విశేషం. ఇది కొంత మేర గాల్లోకి ఎగిరి మళ్లీ మార్స్ ఉపరితలంపై దిగింది. అది విజయవంతంగా ఎగరగానే నాసా శాస్త్రవేత్తల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇన్‌జెన్యూయిటీ తొలిసారి ఎగిరిన తర్వాత దాని నుంచి డేటాను మార్స్ హెలికాప్టర్ టీమ్ అందుకున్నదని నాసా వెల్లడించింది. అందులోని రోటార్ మోటార్లు ఆరోగ్యంగా ఉన్నట్లు చెప్పింది.
"Ingenuity has performed its first flight — the first flight of a powered aircraft on another planet!"
— NASA (@NASA) April 19, 2021
The data reveals: Our #MarsHelicopter has had a successful first flight: 🚁 pic.twitter.com/h5a6aGGgHG
You wouldn’t believe what I just saw.
— NASA's Perseverance Mars Rover (@NASAPersevere) April 19, 2021
More images and video to come…#MarsHelicopterhttps://t.co/PLapgbHeZU pic.twitter.com/mbiOGx4tJZ
యురోపియన్ ఫుట్‌బాల్‌లో ప్రకంపనలు.. కొత్త లీగ్‌కు సై అన్న ఆరు క్లబ్‌లు
రెమ్‌డెసివిర్ మంత్రదండం కాదు.. స్టెరాయిడ్స్ పని చేస్తాయి: ఎయిమ్స్ చీఫ్
ఇక వేగంగా వ్యాక్సిన్లు.. సీరమ్, భారత్ బయోటెక్‌లకు 4500 కోట్లు
ఇక పేటీఎం నుంచి ఎల్ఐసీ పాలసీ ప్రీమియం
గుడ్‌న్యూస్.. నోటి ద్వారా ఇచ్చే రెమ్‌డెసివిర్ అభివృద్ధి చేసిన జుబిలంట్ ఫార్మా
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్‌కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్‌ఖాన్‌తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్‌కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!