ఐదు రోజులుగా టెలిస్కోప్ నుంచి నాసాకు అందని సిగ్నల్స్.. ఎందుకంటే..?
గత ఐదు రోజులుగా హబుల్ టెలిస్కోప్ నుంచి నాసాకు ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదు. దాంతో నాసా శాస్త్రవేత్తలు కారణాలు కనుగొనే పనిలో పడ్డారు. అయితే, దీనికంతటికి మూలకారణం

వాషింగ్టన్ : గత 30 ఏండ్లుగా అంతరిక్షంలో ఉండి చాలా ముఖ్యమైన సమాచారాన్ని సేకరించి పంపుతున్న హబుల్ టెలిస్కోప్ అకస్మాత్తుగా పనిచేయడం మానేసింది. గత ఐదు రోజులుగా హబుల్ టెలిస్కోప్ నుంచి నాసాకు ఎలాంటి సిగ్నల్స్ అందడం లేదు. దాంతో నాసా శాస్త్రవేత్తలు కారణాలు కనుగొనే పనిలో పడ్డారు. అయితే, దీనికంతటికి మూలకారణం 1980 నాటి కంప్యూటర్లో లోపమని గుర్తించిన శాస్త్రవేత్తలు.. ఆ లోపాన్ని అధిగమించేందుకు నిరంతరం కృషిచేస్తున్నారు. నాసా ప్రకారం, జూన్ 13 సాయంత్రం 4 గంటలకు దానిలోని పేలోడ్ కంప్యూటర్ అకస్మాత్తుగా నిలిచిపోయింది. హబుల్ వ్యవస్థలో లోపం కారణంగా ప్రస్తుతం ఈ టెలిస్కోప్ భూమి యొక్క చిత్రాలను తీయడం ఆపివేసింది.
కంప్యూటర్ లోపాన్ని తొలగించడంలో నిమగ్నమైన శాస్త్రవేత్తల బృందం.. దాని బ్యాకప్ మాడ్యూల్‌ను మూసివేసే ప్రయత్నంలో ఉన్నది. ఇది సాధ్యమైతేనే టెలిస్కోప్ పని చేయగలుగుతుంది. ఆదివారం ఈ వ్యవస్థ మూతపడటంతో దానిలోని ప్రధాన కంప్యూటర్ కూడా సిగ్నల్స్ ఇవ్వడం ఆపివేసింది. మేరీల్యాండ్‌లోని నాసా స్పేస్ ఫ్లైట్ సెంటర్లోని శాస్త్రవేత్తలు సోమవారం హబుల్ టెలిస్కోప్ కంప్యూటర్ను లాంచ్ చేసే ప్రయత్నం చేశారు. అయితే కొంత సమయం తర్వాత పాత సమస్యే ఎదురైంది.
హబుల్ టెలిస్కోప్‌ను 33 వేల కోట్లతో 1990 లో భూమి యొక్క తక్కువ కక్ష్యలో స్థాపించారు. ఈ టెలిస్కోప్‌ను నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ సహకారంతో అభివృద్ధి చేశారు. ఇలాంటి సమస్యల నుంచి బయటపడేందుకు నాసా 10 బిలియన్ డాలర్ల జేమ్స్ వెబ్ టెలిస్కోప్‌ను ప్రారంభించటానికి యోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఇవి కూడా చదవండి..
కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందంటే..?
ఈ మామిడి పండ్లు చాలా కాస్ట్లీ గురూ..!
మూడో అతిపెద్ద వజ్రం దొరికింది.. ఎక్కడంటే..?
కరోనా పుట్టినిల్లు.. వుహాన్‌లో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది ?
యువరాణి నిర్ణయం: రూ.14 కోట్ల భత్యం నిరాకరణ
అంత్యక్రియల వేళ తల్లి మాట విని లేచిన కొడుకు
ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్: స్మిత్ నంబర్ 1.. కోహ్లీ 4..
చరిత్రలో ఈరోజు.. ముంతాజ్ జ్ఞప్తిగా తాజ్‌మహల్ నిర్మాణం
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

