Motorola | 200 మెగాపిక్సెల్ కెమెరాతో త్వరలో మోటో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గ్రాండ్ ఎంట్రీ!
బడ్జెట్, మధ్యశ్రేణి ఫోన్ల విభాగంలో ముందున్న మోటొరోలా ప్రీమియం క్యాటగిరీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తున్నామని కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ : బడ్జెట్, మధ్యశ్రేణి ఫోన్ల విభాగంలో ముందున్న మోటొరోలా ప్రీమియం క్యాటగిరీలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. 200 మెగాపిక్సెల్ కెమెరాతో కూడిన లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌పై కసరత్తు సాగిస్తున్నామని కంపెనీ ఇటీవల స్పష్టం చేసింది. అత్యాధునిక ఫీచర్లు, క్వాలిటీ కెమరాలతో ఈ స్మార్ట్‌ఫోన్ జులైలో మార్కెట్లోకి వస్తుందని భావిస్తున్నారు.
లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ గ్రాండియర్ కెమరా ఫీచర్లతో పాటు స్నాప్‌డ్రాగన్ 8+ జెన్ 1 ఎస్ఓసీ చిప్సెట్తో 125డబ్ల్యూ ఫాస్ట్‌చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. మొటొరోలా లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్‌తో తీసిన ఫోటోలు తనను అమితంగా ఆకట్టుకున్నాయని కంపెనీ మొబైల్ ఫోన్ బిజినెస్ జనరల్ మేనేజర్ షెన్జిన్ వెల్లడించారు. ఇక లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ పేరు, ధర ఇతర వివరాలను షెన్జిన్ ప్రస్తావించలేదు.
మరోవైపు మోటోరోలా ఇటీవల లాంఛ్ చేసిన మోటో ఎడ్జ్ ఎక్స్ 30 వంటి స్మార్ట్ఫోన్లు భారత్‌లోనూ లాంఛ్ కావడంతో తాజా స్మార్ట్‌ఫోన్ సైతం భారత్‌లో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు. ఇక జులైలో మోటో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ కస్టమర్ల ముందుకు రానుందని సమాచారం. మోటో లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి ఎంటరైతే వివో ఎక్స్80 ప్రొ, వన్‌ప్లస్ 10 ప్రొ వంటి ఫోన్లకు దీటైన పోటీ ఇస్తుందని చెబుతున్నారు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

