ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా నుంచి మరో స్మార్ట్‌ఫోన్ త్వరలో విడుదల కానుంది. మోటో జీ 200 పేరుతో మోటరోలా భారత విపణిలోకి ఆ ఫోన్‌ను డిసెంబర్లో విడుదల చేయనుంది. ఇప్పటికే మోటో జీ200 ఫోన్ యూరప్‌లో విడుదలైంది. అక్కడ దాని ధర 449 యూరోలు. అంటే మన కరెన్సీలో రూ.37,600 అన్నమాట.
భారత్‌లో కూడా త్వరలోనే మోటో జీ200 స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేస్తామని మోటరోలా ప్రకటించింది. అయితే.. ఈ ఫోన్లో అన్నీ అడ్వాన్స్డ్ ఫీచర్లే ఉండనున్నాయి. స్నాప్‌డ్రాగన్ 888 ప్లస్ ఎస్వోసీ ప్రాసెసర్, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి బెస్ట్ ఫీచర్లు ఈ ఫోన్లో ఉండనున్నాయి.
5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 6.8 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ విడుదల కానుంది. నిజానికి ఈ ఫోన్ నవంబర్ 30నే విడుదల అవుతుందని అంచనా వేసినా.. డిసెంబర్ మొదటి లేదా రెండో వారంలో విడుదలవుతుందని టెక్ నిపుణులు చెబుతున్నారు.
Ok..an update: The phone already launched globally as Motorola G200 & till now the 30th November date is confirmed but there is a chance of slight delay, if that happens the phone will launch in 1st or 2nd week of December but India launch is CONFIRMED and it'll not cancel !
— Debayan Roy (Gadgetsdata) (@Gadgetsdata) November 20, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Shortcuts : వాట్సాప్ వెబ్ లో షార్ట్‌కట్స్ గురించి తెలుసా..? అవేంటంటే..?
Motorola : భారత్ మార్కెట్లో త్వరలో మోటో జీ71, మోటో జీ51, మోటో జీ31 ఎంట్రీ
Huawei Watch : న్యూ హువీ జీటీ రన్నర్ వాచ్ లాంఛ్..ధర ఎంతంటే!
Motorola : మోటో వాచ్ 100 లాంఛ్..ధర ఎంతంటే!
Xiaomi : రెండు మినీ స్మార్ట్ఫోన్లను లాంఛ్ చేయనున్న షియామి!