Meta Feature | సోషల్ మీడియా యూజర్లకు మెటా కంపెనీ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్లో వివిధ దేశాలకు చెందిన రీల్స్ వస్తుంటాయి. దాంతో భాష అర్థం కాక ఇబ్బందిపడుతుంటారు. తాజాగా ఈ సమస్యకు మెటా కంపెనీ చెక్ పెట్టింది. హిందీ, పోర్చుగీస్ భాషలకు కూడా ఏఐ ఆధారిత వీడియో టాన్స్లేట్ ఫీచర్‌ను రిలీజ్ చేసింది. దాంటే కంటెంట్ క్రియేటర్లు తమ సొంత వాయిస్‌ను ఉపయోగించి ఇతర భాషల్లోనూ తమ వీడియోలను ఆటోమేటిక్‌గా డబ్ చేయగలిగే అవకాశం ఉంటుంది. రీల్ వ్యూయర్స్ వారికి కావాల్సిన లాంగ్వేజ్‌లో రీల్స్‌ను చూడగలిగే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్‌ను మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఓ వీడియో ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం రీల్స్ ట్రాన్స్‌లేట్ హిందీ, పోర్చుగీస్, ఇంగ్లిష్, స్పానిష్ భాషల్లో అందుబాటులో ఉందని.. భవిష్యత్‌లో మరిన్ని భాషలో జోడించనున్నట్లు పేర్కొన్నారు.
ఏఐ ద్వారా ట్రాన్స్‌లేట్ చేసిన వీడియోను యూజర్లు చూస్తున్నారని తెలియజేసేందుకు ట్రాన్స్లేలెడ్ విత్ మెటా ఏఐ అనే ట్యాగ్ ప్రతి ట్రాన్స్‌లేట్ రీల్లో కనిపిస్తుంది. ఈ ఫీచర్ లాంగ్వేజ్ అవరోధాన్ని ఛేదించడమే కాకుండా సృష్టికర్తలు ప్రపంచవ్యాప్తంగా ఇతర వ్యూయర్స్‌ను చేరుకునేందుకు సహాయపడుతుందని మెటా కంపెనీ చెబుతున్నది. చాలామంది కంటెంట్ క్రియేటర్లు ప్రపంచవ్యాప్తంగా వ్యూయర్స్‌ను చేరుకోవాలనుకుంటున్నారని.. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకొని వివిధ భాషల్లో రీల్స్‌ను సులభంగా షేర్ చేసుకునేలా ఫీచర్స్‌ను ప్రారంభించినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. మెటా ఫీచర్ క్రియేటర్ వాయిస్, టోన్‌ను గుర్తించి దాన్ని మరో లాంగ్వేజ్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. దాంతో వీడియో క్రియేటర్ కొత్త భాషలో మాట్లాడుతున్నట్లుగా చూపిస్తుంది. క్రియేటర్లు లిప్ సింక్‌ను చేయొచ్చు. వ్యూయర్స్‌కు ట్రాన్స్‌లేట్ వద్దు అనే ఆప్షన్ సైతం ఉంటుంది. దాంతో లాంగ్వేస్ మారకుండా ఉంటుంది.
ఈ ఫీచర్ అన్ని ఇన్స్టాగ్రామ్ పబ్లిక్ అకౌంట్స్, వెయ్యికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న ఫేస్బుక్ క్రియేటర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. మెటా ఆగస్టులో ఈ ఫీచర్‌ను ఇంగ్లీష్, స్పానిష్‌తో మాత్రమే ప్రారంభించింది. తాజాగా హిందీ, పోర్చుగీస్‌ను జోడించింది. కంపెనీ భారతదేశం, బ్రెజిల్‌ను లక్ష్యం చేసుకొని ఫీచర్‌ను తీసుకువచ్చింది. ఇది రీల్స్ క్రియేటర్స్‌ను కొత్త దేశాల్లో ప్రేక్షకులను చేరుకోవడానికి, రీల్స్ వ్యూయర్స్ సంఖ్యను పెంచుకునేందుకు సహాయపడుతుందని మెటా కంపెనీ పేర్కొంటుంది. కంపెనీ ఇప్పుడు రీల్స్‌లో క్యాప్షన్లు, టెక్స్ట్ స్టిక్కర్ల కోసం ట్రాన్స్‌లేట్ ఫీచర్స్న్ను విడుదల చేస్తోందని మెటా కంపెనీ చెబుతున్నది. వినియోగదారులు త్వరలో రీల్స్‌లో టెక్స్ట్‌లో ట్రాన్స్‌లేట్ చేసేందుకు ఆప్షన్ ఉంటాయని.. వారి సొంత భాషలోనూ టెక్స్‌ను చూసేందుకు వీలుంటుంది. మిలియన్ల మంది యూజర్లు ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ను ఉపయోగిస్తున్న భారత్‌లో హిందీ కంటెంట్ క్రియేటర్లకు ఈ ఫీచర్ గేమ్ ఛేంజర్‌గా పేర్కొంటున్నారు. ఇకపై రీల్ కేవలం ఒక భాషకే పరిమితం కాకుండా.. ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో వినే అవకాశం ఉంటుంది.