న్యూఢిల్లీ : బరువు తగ్గాలనుకునే వారు డైటీషియన్లు, జిమ్ ట్రైనర్ల చుట్టూ తిరిగి డబ్బు, సమయం వృధా చేసుకునే అవసరం లేదు. ఎంచక్కా ఏఐ చాట్‌బాట్ చాట్‌జీపీటీ (ChatGPT) వర్కవట్ ప్లాన్‌ను అనుసరిస్తే సింపుల్‌గా బరువు తగ్గవచ్చు. చాట్‌జీపీటీ క్రియేట్ చేసిన వర్కవుట్ ప్లాన్‌ను అనుసరించి గ్రెగ్ ముషేన్ అనే వ్యక్తి ఏకంగా 11 కిలోల బరువు తగ్గాడు. తొలుత రన్నింగ్ అంటే విముఖత చూపే గ్రెగ్ ఆరోగ్యకరమైన వర్కవుట్ ప్లాన్‌ను చాట్‌బాట్ సాయంతో డెవలప్ చేసుకున్నాడు.
ఈ ప్రక్రియలో అతడు 11 కిలోల బరువు తగ్గి స్లిమ్ షేప్‌లోకి మారాడు. ఏఐ చాట్‌బాట్ సలహాను ముందు గ్రెగ్ లైట్ తీసుకున్నాడు. నడకతో ప్రారంభించి కొద్దికొద్దిగా వేగం పెంచుతూ రన్నింగ్ చేయడం అలవరుచుకున్నాడు. కొద్ది రోజులు తక్కువ దూరం నడిచిన గ్రెగ్ మెల్లిగా నడిచే దూరం పెంచుకుంటూ వెళ్లడంతో పాటు వేగాన్ని పెంచి పరిగెత్తడం అలవాటు చేసుకున్నాడు.
ఫిట్నెస్, ఆరోగ్యం సాధించాలంటే మెల్లిగా, కుదురుగా రన్నింగ్‌ను ప్రాక్టీస్ చేయడమేనని, ప్రారంభించగానే వేగంగా పరిగెత్తడం వంటివి మానుకోవాలని, ఇలా చేస్తే గాయాలపాలయ్యే ప్రమాదం ఉందని ఎక్సర్సైజ్ ఫిజియాలజిస్ట్ మెకోంకి సూచించారు. చాట్‌జీపీటీ వర్కవుట్ ప్లాన్‌ను ఆయన సమర్ధించాడు.
ఏఐ టూల్ సూచనతో గ్రెగ్ ప్రస్తుతం వారానికి ఆరు రోజులు రన్నింగ్ చేస్తూ మరికొన్ని వర్కవుట్ల కోసం సిద్ధంగా ఉన్నాడు. ఈ క్రమంలో తాను 11 కిలోల బరువు తగ్గడం చాట్‌జీపీటీ చలవేనని చెబుతున్నాడు. జనరేటివ్ వర్కవుట్ ప్లాన్ గ్రెగ్‌కు వర్కవుట్ కావడంతో ఫిట్నెస్ ప్రోగ్రామ్స్‌లో టెక్నాలజీతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని వెల్లడైంది.
Read More :