ఇండియాలో ఐఫోన్ కు ఉన్న క్రేజే వేరు. ఐఫోన్ కొత్త మోడల్ వస్తే చాలు.. ఐఫోన్ లవర్స్ వెంటనే ఆ మోడల్ ను కొనేస్తారు. ఐఫోన్ చేతుల్లో ఉంటే వచ్చే కిక్కే వేరు. ఐఫోన్ కు ఉన్న డిమాండ్ దృష్ట్యా.. యాపిల్ కంపెనీ ఇండియాలో ఐఫోన్లపై పలు డిస్కౌంట్లను అందిస్తూ ఉంటుంది. ఇటీవలే ఐఫోన్ 13ను విడుదల చేసిన యాపిన్.. ఐఫోన్ 12పై కూడా భారీ డిస్కౌంట్లను ప్రకటించింది.
తాజాగా.. ఐఫోన్ ఎస్ఈ మీద భారీ డిస్కౌంట్ ను ప్రకటించింది. నిజానికి.. ఐఫోన్ ఎస్ఈ ఎంఆర్పీ ధర రూ.39,900. అక్టోబర్ 3న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో ఐఫోన్ ఎస్ఈని రూ.25,999 కే అందించనున్నారు. ఇది 64 జీబీ వేరియంట్ ఫోన్. 128 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.30,999కి అందించనున్నారు. 256 జీబీ వేరియంట్ ఫోన్ ను రూ.40,999కి అందించనున్నారు.
అయితే.. ఇది ఫ్లిప్ కార్ట్ అందించే డిస్కౌంట్ మాత్రమే. అవే కాకుండా.. వేరే డిస్కౌంట్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్ తో కలిపి.. ఐఫోన్ ఎస్ఈని కేవలం రూ.18,499 కే పొందే చాన్స్ ఉంది. ఐసీఐసీఐ, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ యూజర్లు ఫ్లిప్ కార్టులో రూ.5000 కంటే ఎక్కువ బుక్ చేస్తే రూ.1500 వరకు డిస్కౌంట్ లభించనుంది. వేరే బ్యాంకుల యూజర్లు.. తమ డెబిట్ కార్డుతో ఆర్డర్ చేస్తే రూ.1000 వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. పాత ఐఫోన్ ను ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.15000 వరకు అదనపు డిస్కౌంట్ లభిస్తుంది.
ఉదాహరణకు.. ఐఫోన్7ను ఎక్స్ఛేంజ్ చేసి ఐఫోన్ ఎస్ఈ తీసుకుంటే.. రూ.18,499కే ఐఫోన్ ఎస్ఈని బుక్ చేసుకునే చాన్స్ ఉంటుంది. అయితే.. మోడల్స్ ను బట్టి ఫోన్ విలువను బట్టి ఎక్స్ఛేంజ్ ధర మారుతూ ఉంటుంది.
4.7 ఇంచ్ రెటీనా హెచ్డీ డిస్ ప్లే, ట్రూ టోన్, ఆంబియెంట్ లైటింగ్, డాల్బీ విజన్, హెచ్ఢీఆర్10 కంపాటిబిలిటీ, యాపిల్ ఏ13 బయోనిక్ చిప్, 8 కోర్ న్యూరల్ ఇంజన్, 5 ట్రిలియన్ ఆపరేషన్స్ పర్ సెకండ్, మిషన్ లర్నింగ్ యాక్సిలరేటర్స్, 18 వాట్స్ చార్జింగ్, ఐవోఎస్ 15 లాంటి ఫీచర్లు ఐఫోన్ ఎస్ఈలో ఉంటాయి.
ఇంకెందుకు ఆలస్యం.. ఐఫోన్ ఎస్ఈని తక్కువ ధరకే సొంతం చేసుకోవాలంటే.. అక్టోబర్ 3న ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం కాగానే.. వెంటనే బుక్ చేసుకోండి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
iOS 15 : ఐవోఎస్ 15కు అప్గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
Xiaomi Civi : అద్భుతమైన ఫీచర్లతో ‘జియోమీ సివి’ స్మార్ట్ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే?
Google Pixel 6 and 6 Pro : అత్యాధునికమైన కెమెరా ఫీచర్లతో గూగుల్ పిక్సెల్ ఫోన్లు