Vivek Oberoi | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, సంచలన దర్శకుడు సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం స్పిరిట్ ఇప్పటికే ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ కీలకమైన విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవల జరిగిన ఒక ప్రెస్ మీట్లో వివేక్ ఒబెరాయ్ ఈ సినిమాపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆయన తన పాత్ర గురించి చెప్పిన మాటలు ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
ప్రెస్ మీట్లో ఒక రిపోర్టర్ ప్రశ్నిస్తూ.. యానిమల్ సినిమాతో బాబీ డియోల్, అలాగే ధురంధర్ చిత్రంతో అక్షయ్ ఖన్నా విలన్లుగా స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చారని గుర్తుచేస్తూ, మీరు కూడా ‘స్పిరిట్’తో అలాంటి రీ-ఎంట్రీ ఇస్తారా? అని అడిగారు. దీనికి స్పందించిన వివేక్ ఒబెరాయ్ తనదైన స్టైల్లో బాలీవుడ్ స్టైల్ డైలాగ్‌తో సమాధానం ఇచ్చారు. “పిక్చర్ అభీ బాకీ హై మేరే దోస్త్” అంటూ ఆసక్తికరంగా స్పందించారు. ఇంకా ఈ సినిమా కోసం తాను చాలా కష్టపడాల్సి ఉందని, తన పాత్రకు పూర్తి న్యాయం చేయడానికి డెడికేషన్‌తో పనిచేస్తున్నానని చెప్పారు.
సందీప్ రెడ్డి వంగా సినిమాల్లో పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా, ఇంటెన్స్‌గా ఉంటాయో తెలిసిందే. అలాంటి దర్శకుడి చేతుల్లో తన పాత్ర మరింత బలంగా రూపుదిద్దుకుంటుందని వివేక్ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలతో ‘స్పిరిట్’ సినిమాలో విలన్ పాత్ర ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందని స్పష్టమవుతోంది.ఇప్పటికే ప్రభాస్ అభిమానులు ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. వివేక్ ఒబెరాయ్ కామెంట్స్‌తో ఈ అంచనాలు మరింత పెరిగాయి. ‘స్పిరిట్’ బాక్సాఫీస్ వద్ద మరోసారి భారీ రికార్డులు సృష్టించడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.