iOS 15 : ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయ్యారా? మీకు తెలియని ఈ బెస్ట్ ఫీచర్ల గురించి తెలుసుకోండి
ఐవోఎస్ 15కు అప్‌గ్రేడ్ అయ్యారా? | గత వారమే.. యాపిల్ ఐవోఎస్ 15ను భారత్‌లో తీసుకొచ్చింది. ఐవోఎస్ 15లో చాలా బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి.

గత వారమే.. యాపిల్ ఐవోఎస్ 15ను భారత్‌లో తీసుకొచ్చింది. ఐవోఎస్ 15లో చాలా బెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. చాలామంది ఐఫోన్ యూజర్లకు తెలిసిన ఫీచర్లు ఫోకస్ మోడ్, షేర్‌ప్లే లాంటివి ఉన్నాయి. కానీ.. ఐఫోన్ యూజర్లకు తెలియని చాలా ఫీచర్లు ఐవోఎస్ 15లో ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Change font size for individual apps
ఐఫోన్‌లోని యాప్స్‌లో ఉన్న ఫాంట్ సైజ్‌లను ఈ ఫీచర్ ద్వారా మార్చుకోవచ్చు. చిన్నగా ఉన్న ఫాంట్‌ను పెంచుకోవచ్చు. పెద్దగా ఉన్న ఫాంట్‌ను తగ్గించుకోవచ్చు. అయితే.. ఒక్క యాప్‌లో మార్పులు చేస్తే.. మిగితా అన్ని యాప్స్‌లో అవే చేంజెస్ అప్లయి అవుతాయి.
Live Text copy-paste
లైవ్ టెక్స్ట్ అనే మరో ఫీచర్ కెమెరా యాప్‌కు సంబంధించింది. టెక్స్ట్ కానీ నెంబర్స్ కానీ పాయింట్ చేసి కొత్త లైవ్ టెక్స్ట్ ఐకాన్‌ను క్రియేట్ చేయొచ్చు. ఆ టెక్స్ట్‌ను కాపీ చేసుకొని ఫోన్ నెంబర్ అయితే.. ఫోన్ కాల్స్ కూడా చేసుకోవచ్చు. లైవ్ టెక్స్ట్ ఆప్షన్‌ను సెట్ చేసుకోవడం కోసం సెట్టింగ్స్‌లోకి వెళ్లి జనరల్, లాంగ్వేజ్ అండ్ రిజియన్, ఎనేబుల్ లైవ్ టెక్స్ట్ అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఐఫోన్ ఎక్స్ఎస్, ఐఫోన్ ఎక్స్ఆర్ మోడల్స్‌తో పాటు ఆ తర్వాతి మోడల్స్‌లో ఈ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.

Record app activity
రికార్డ్ యాప్ యాక్టివిటీ అనే ఫీచర్ ద్వారా ఏ యాప్స్.. ఐఫోన్ యూజర్ పర్సనల్ డేటాను యాక్సెస్ చేసుకుంటున్నాయో తెలుసుకోవచ్చు. లొకేషన్, ఫోటోలు, కెమెరా, మైక్రోఫోన్ లాంటి ప్రైవేట్ డేటాను కొన్ని యాప్స్ యాక్సెస్ చేసుకుంటాయి. యాప్స్ కనెక్ట్ అయి ఉన్న డొమేన్స్ సమాచారాన్ని కూడా ఈ ఫీచర్ రికార్డు చేస్తుంది. దీని కోసం సెట్టింగ్స్‌లో ప్రైవసీ అనే ఆప్షన్‌లోకి వెళ్లి స్క్రోల్ డౌన్ చేసి రికార్డ్ యాప్ యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి.
Safari address bar placement
సఫారీ బ్రౌజర్లో ప్లేస్మెంట్ యూఆర్ఎల్ లేదా అడ్రస్ బార్‌ను సెట్ చేసేదే ఈ ఫీచర్. స్క్రీన్ కింద ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. సఫారీ బ్రౌజర్లో ట్యాబ్ గ్రూప్స్, వాయిస్ సెర్చ్ ఫీచర్‌ను యాడ్ చేసింది. అడ్రస్ బార్ ప్లేస్మెంట్ ఆప్షన్ కోసం సఫారీ బ్రౌజర్‌ను ఓపెన్ చేసి ఏదైనా వెబ్సైట్ ఓపెన్ చేసి కింద Aa అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి.. Show top address bar ను సెలెక్ట్ చేసుకోవాలి.
Voice Memos playback
వాయిస్ మెమోస్ అనే యాప్ ద్వారా ఆడియో క్లిప్స్‌ను రికార్డ్ చేసుకోవచ్చు. వాయిస్ మెమోస్ ప్లేబ్యాక్ స్పీడ్‌ను చేంజ్ చేసుకోవచ్చు. ఆడియో రికార్డింగ్స్‌ను వాయిస్ మెమోస్ అనలైజ్ చేసి స్కిప్ సైలెన్స్ అనే సింగిల్ ట్యాప్ ద్వారా సైలెంట్ గ్యాప్స్‌ను స్కిప్ చేసుకోవచ్చు. సెట్టింగ్స్‌లో ఆడియో క్లిప్ బటన్ కింద ఈ ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోవచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Slow Wi-Fi : వైఫై స్లోగా ఉందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే వైఫై సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో వర్క్ అవుతుంది
Flipkart Big Billion Days 2021 : అక్టోబర్ 7 నుంచి 12 వరకు సేల్.. ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు
First e-Baby : ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

