Slow Wi-Fi : వైఫై స్లోగా ఉందా? ఈ ట్రిక్స్ ఫాలో అయితే వైఫై సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో వర్క్ అవుతుంది
వైఫై స్లోగా ఉందా? | ఈరోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రపంచం మనుగడే లేదు. అవును.. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు చాలా అవసరం.
ఈరోజుల్లో ఇంటర్నెట్ లేకపోతే ఈ ప్రపంచం మనుగడే లేదు. అవును.. ఇంటర్నెట్ అనేది ఇప్పుడు చాలా అవసరం. మారుమూల పల్లెల్లో కూడా ఇంటర్నెట్తోనే చాలా పనులు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరి చేతుల్లో ఇప్పుడు స్మార్ట్‌ఫోన్ ఉంది. స్మార్ట్‌ఫోన్ వల్ల ఎన్నో పనులు సులభతరం అవుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈస్మార్ట్‌ఫోన్, ఇంటర్నెట్.. ఈ రెండు ప్రపంచం మొత్తాన్ని ఓ కూగ్రామంగా మార్చేశాయి.

ఇంటర్నెట్ యాక్సెస్ కోసం చాలామంది వైఫై కనెక్షన్ తీసుకుంటారు. కనెక్షన్ తీసుకున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ.. కొన్ని రోజుల తర్వాత వైఫై స్పీడ్ తగ్గుతుంది. ఏం చేసినా స్పీడ్ మాత్రం పెరగదు. దీని వల్ల ఇంటర్నెట్లో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవాళ్లు స్లో వైఫై వల్ల చాలా ఇబ్బంది పడతారు. అయితే.. వైఫై స్లో అవ్వడానికి పలు కారణాలు ఉంటాయి. కారణం ఏదైనా.. ఈ ట్రిక్స్ ఫాలో అయితే వైఫై సూపర్ ఫాస్ట్ స్పీడ్‌లో వర్క్ అవుతుంది.
వైఫై అనాలిసిస్ అప్లికేషన్
దానికోసం ముందు చేయాల్సింది ఏంటంటే.. వైఫై అనలైజర్ అనే ఒక టూల్‌ను సిస్టమ్‌లో ముందు డౌన్లోడ్ చేసుకోండి. ఏదైనా బెస్ట్ వైఫ్ అనలైజర్ టూల్ అయినా పర్వాలేదు. అప్లికేషన్‌ను డౌన్లోడ్ చేసుకున్నాక.. అప్లికేషన్‌ను ఓపెన్ చేయండి. అనలైజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సిస్టమ్‌కు వస్తున్న వైఫై స్పీడ్‌ను అది అనలైజ్ చేస్తుంది. వైఫై చానెల్స్, ఫ్రీక్వెన్సీకి సంబంధించిన సమాచారాన్ని డిస్ప్లే చేస్తుంది.

వీక్ చానెల్స్ అనాలిసిస్‌ను అప్లికేషన్ డిస్ప్లే చేయగానే వెంటనే రూటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాల్సి ఉంటుంది. రూటర్ సెట్టింగ్స్‌లోకి వెళ్లాలంటే.. బ్రౌజర్ ఓపెన్ చేసి TP-Link Routers: https://tplinklogin.netNet gear Routers: https://routerlogin.netLinksys Routers: navigate to 192.168.1.1 ఈ లింక్‌ను ఓపెన్ చేయండి. రూటర్ సెట్టింగ్స్ ఓపెన్ కాగానే వైఫై యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ అవండి. ఆ తర్వాత వైర్లెస్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి అడ్వాన్స్డ్ సెట్టింగ్స్‌ను ఓపెన్ చేసి optimum connection అనే ఆప్షన్‌ను సెలెక్ట్ చేసుకోండి. సేవ్ చేసి.. రూటర్‌ను రీస్టార్ట్ చేస్తే చాలు.. వైఫై సూపర్ ఫాస్ట్‌గా రన్ అవుతుంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flipkart Big Billion Days 2021 : అక్టోబర్ 7 నుంచి 12 వరకు సేల్.. ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు
First e-Baby : ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
స్కూల్ చైర్‌తో మంటలార్పే డ్రోన్
Digital quality of life : డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో భారత్‌కు 59వ స్థానం
Android Malware : ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? సైబర్ క్రిమినల్స్ టార్గెట్ మీరే.. ఎలాగంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tiger Shroff | టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటన.. షూటింగ్ సెట్లలో కఠినమైన భద్రత కల్పించాలని FWICE విజ్ఞప్తి
Maganoor Sub Station: మాగనూరు విద్యుత్ శాఖలో ‘బినామీల’ వసూళ్ల కలకలం !
Idupu Kayitham | ‘ఇడుపు కాయితం’ పాటపై వివాదం.. తెలంగాణ సంప్రదాయాలను తప్పుగా చూపించారంటూ ఫైర్..!
Anchor Priyavadhana | కోలీవుడ్‌లో తీవ్ర విషాదం.. 24 ఏళ్ల న్యూస్ రీడర్, నటి ప్రియ వదన మృతి!
Kieron Pollard: ముంబై ఇండియన్స్ ప్రధాన కోచ్‌గా కీరన్ పోలార్డ్
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

