Amazon Great Indian Festival Sale : అమెజాన్ సేల్ స్టార్ట్ డేట్ ఫిక్స్.. ఈసారి భారీ డిస్కౌంట్లు, ఆఫర్లు
అమెజాన్ సేల్ స్టార్ట్ డేట్ ఫిక్స్ | ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021కు రంగం సిద్ధం చేసుకుంది.
ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్.. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021కు రంగం సిద్ధం చేసుకుంది. అక్టోబర్ 4 నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభం కానుంది. త్వరలో రాబోయే దసరా, దీపావళి పండుగల సందర్భంగా.. ఈ సేల్‌ను అమెజాన్ ప్రారంభిస్తోంది. అక్టోబర్ 7 నుంచి ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ ప్రారంభం అవనున్న నేపథ్యంలో.. దాని కంటే మూడు రోజుల ముందే.. అమెజాన్ సేల్ ప్రారంభం కానుంది.

ఈసేల్ నెల రోజుల పాటు కొనసాగనుంది. ప్రతి రోజు పలు వస్తువుల మీద భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అమెజాన్.. ఈ సేల్‌లో అందించనుంది. ప్రముఖ బ్రాండ్స్ ఫోన్లు, యాక్సెసరీస్, స్మార్ట్ వాచ్, టాబ్లెట్, లాప్టాప్స్ లాంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లు, స్మార్ట్ టీవీ, ఇతర హోమ్ అప్లయెన్సెస్ మీద అమెజాన్ సేల్‌లో భారీ డిస్కౌంట్లు లభించనున్నాయి.
వీటితో పాటు.. ఇకో, ఫైర్ టీవీ, కిండిల్ లాంటి డివైజ్‌లు కూడా తక్కువ ధరకే లభించనున్నాయి. అలెక్సా డివైజ్ మీద కూడా అమెజాన్ భారీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ సేల్‌లో 1000 కి పైగా సరికొత్త ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. యాపిల్, అసుస్, ఫోసిల్, హెచ్‌పీ, లెనోవో, వన్‌ప్లస్, సామ్సంగ్, సోనీ, జియోమీ బ్రాండ్లకు చెందిన ప్రొడక్ట్స్ విడుదల కానున్నాయి. సోనీ పీఎస్5, మైక్రోసాఫ్ట్ ఎక్స్‌బాక్స్ కూడా ఈ సేల్‌లో రిలీజ్ అవనున్నట్టు తెలుస్తోంది.
అమెజాన్ పే, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిక్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే.. అదనంగా డిస్కౌంట్‌తో పాటు క్యాష్‌బ్యాక్ కూడా లభించనుంది. అమెజాన్ ప్రైమ్ మెంబర్షిప్ ఉన్న కస్టమర్లకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్కు ముందే యాక్సెస్ ఉంటుంది. అలాగే.. వాళ్లకు అదనంగా క్యాష్‌బ్యాక్ ఆఫర్లు, నోకాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు, అదనపు వారంటీలు లభించనున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Flipkart Big Billion Days 2021 : అక్టోబర్ 7 నుంచి 12 వరకు సేల్.. ఈ ఫోన్ల మీద భారీ డిస్కౌంట్లు
First e-Baby : ఈ పాప.. తొలి ‘ఆన్లైన్ బేబీ’.. ఎలాగంటే?
స్కూల్ చైర్‌తో మంటలార్పే డ్రోన్
Digital quality of life : డిజిటల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్‌లో భారత్‌కు 59వ స్థానం
Android Malware : ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తున్నారా? సైబర్ క్రిమినల్స్ టార్గెట్ మీరే.. ఎలాగంటే?
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

