స్కూల్ చైర్‌తో మంటలార్పే డ్రోన్

కాంబోడియా విద్యార్థుల వినూత్న ఆవిష్కరణ
నమ్పెన్: ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు మీదనున్న అంతస్తుల్లోకి అగ్నిమాపక సిబ్బంది వెళ్లడం కష్టతరమవుతుంది. కాంబోడియాకు చెందిన విద్యార్థులు దీనికి చక్కని పరిష్కారాన్ని చూపించారు. పాఠశాల కుర్చీతో మానవసహిత డ్రోన్ వ్యవస్థను రూపొందించారు. దీనిసాయంతో అగ్నిప్రమాదం జరిగిన భవంతుల్లోని పై ఫ్లోర్లలో ఎంతమంది చిక్కుకున్నారు? అన్న విషయాన్ని తెలుసుకోవడంతోపాటు.. మంటలను ఆర్పేందుకు కార్బన్ డై ఆక్సైడ్ సిలిండర్‌ను పైవరకు తీసుకెళ్లడం, వాయువును పిచికారీ చేయడం, నీటిని జల్లడం వంటివి చేయవచ్చని నేషనల్ పాలిటెక్నిక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాంబోడియా విద్యార్థులు తెలిపారు. ట్రాఫిక్‌లో చిక్కుకున్న రోగులను తరలించడానికి ప్రాథమికంగా ఈ డ్రోన్‌ను తయారుచేసినట్టు చెప్పారు. మరిన్ని ఫీచర్లు జోడించి డ్రోన్ ఎగిరే ఎత్తును పెంచుతామన్నారు.
డ్రోన్ ప్రొటోటైప్ వివరాలు
మోయగలిగే బరువు 60 కిలోలు
ఎగిరే ఎత్తు 13.1 అడుగులు
ప్రయాణించే దూరం 1 కిలోమీటరు
ఖర్చు 14.75 లక్షలు
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- drone
- fire safety
- school chair
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

