Temperature | రాష్ట్రంలో దంచికొడుతున్న ఎండలు.. 22 జిల్లాల్లో 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు
Temperature | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది.
Temperature | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో తీవ్రమైన వేడి, ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది. ఆదివారం 22 జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొన్నది. దీంతో ఆయా జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసినట్టు తెలిపింది.
అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెంలో 41.8 డిగ్రీలు, జగిత్యాలలో 41.6, మంచిర్యాలలో 41.6, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లిలో 41.5, ములుగు, నిజామాబాద్‌లో 41.4, నల్లగొండలో 41.3 డిగ్రీలుగా నమోదయ్యాయని వెల్లడించింది. మిగతా 11 జిల్లాల్లో 40 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించింది. మరో నాలుగు రోజులు ఉష్ణోగ్రతలు ఇలానే ఉంటాయని పేర్కొన్నది.
ద్రోణి, ఉపరితల చక్రవాత ఆవర్తనం కారణంగా ఏప్రిల్ 5 వరకు తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. సోమవారం మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట, భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగూడెం, హైదరాబాద్, ములుగు, సూర్యాపేట, ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబాబాద్, ఆదిలాబాద్, మహబూబాబాద్, జనగామలో తేలికపాటి వర్షం కురిసినట్టు తెలిపింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ‘ఆదర్శ కుటుంబం’ అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన.. వెంకీ, త్రివిక్రమ్ మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
Baththa Out on Netflix | ఓటీటీలోకి విజయ్ సేతుపతి ‘బత్తా’.. తెలుగులోనూ అందుబాటులోకి వచ్చిన సినిమా!
Katrina Kaif | ‘బౌన్స్ బ్యాక్ అవ్వాలా? ఎందుకు?’.. ట్రోలింగ్‌కు కత్రినా కైఫ్ గట్టి సమాధానం!
Chiru-Kamal | ఓటీటీలోకి మెగాస్టార్ చిరంజీవి.. ‘మెగావర్స్’లో కమల్ హాసన్‌తో సందడి చేయనున్నారా?
US Fed Meeting | వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన అమెరికా కేంద్ర బ్యాంక్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

