iPhone 17 Pro : మార్కెట్లో ఉన్న లేటెస్ట్ యాపిల్ ఫోన్ ఐఫోన్ 17 ప్రోను డిస్కౌంట్లో దక్కించుకోవాలనుకుంటే ఇదో చక్కటి అవకాశం. ప్రస్తుతం ‘ఐఫోన్ 17 ప్రో’ ధర దాదాపు రూ.1,34,900గా ఉంది. అయితే, దీనిపై దాదాపు రూ.44,000 వరకు డిస్కౌంట్ పొందేవీలుంది. అయితే, ఇక్కడ సూచించిన ప్రాసెస్ ఫాలో అయితేనే ఈ డిస్కౌంట్ దొరుకుతుంది.
అది కూడా అమెజాన్ లో మాత్రమే ఈ డిస్కౌంట్ అందుకోవచ్చు. ముందుగా ఐఫోన్ ఎయిర్, 17 ప్రొ, 17 ప్రొ మ్యాక్స్ ఫోన్ లలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలి. ఈ ఫోన్ కు అమెజాన్ సంస్థ రూ.5,000 డిస్కౌంట్ అందిస్తుంది. దీనికి సంబంధించిన కూపన్ అమెజాన్ లోనే క్లెయిమ్ చేసుకోవాలి. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డులపై రూ.1,750 డిస్కౌంట్ ఉంటుంది. దీంతోపాటు మీ వద్ద పాత ఐఫోన్ ఉండే భారీగా డిస్కౌంట్ పొందవచ్చు. అందులోనూ ఐఫోన్ 15 ప్రో వంటి లేటెస్ట్ మోడల్స్ ఉంటే దాదాపు రూ.37,300 వరకు ఎక్స్ఛేంజ్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్, డిస్కౌంట్, కూపన్ కలిపి రూ.44,000 వరకు డిస్కౌంట్ అందుతుంది. దీంతో మీ పాత ఐఫోన్ స్థానంలో కొత్త ఐఫోన్ మోడల్ ను తక్కువ ధరలోనే కొనుగోలు చేయవచ్చు.
ఐఫోన్ 17 ప్రో ఫోన్ ప్రధాన ఫీచర్లివి. 6.3 అంగుళాల ఎల్టీపీవో సూపర్ రెటినా, ఎక్స్ డీఆర్ ఓలెడ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రిఫ్రెష్ రేట్, 3,000 నిట్స్ బ్రైట్ నెస్, ట్రిపుల్ రేర్ కెమెరా విత్ 48 ఎంపీ సెన్సర్స్, మెయిన్ అల్ట్రా వైడ్, టెలిఫొటో, 8ఎక్స్ ఆప్టికల్ జూమ్, 18 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్స్ చార్జర్, ఐఓఎస్ 26 వంటి ఫీచర్లున్నాయి.