iPhone 14 | ఐఫోన్ 14 కెమెరా ఫీచర్లపై క్రేజీ అప్డేట్!
iPhone 14 |ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కూ రాబోయే ఐఫోన్ హాట్ ఫీచర్లపై ఇచ్చిన అంచనాలపై హాట్ డిబేట్ సాగుతోంది. 2022లో రానున్న ఐఫోన్ 14.. 48 మెగాపిక్సెల్ లెన్స్‌తో రానుందని కూ చెబుతున్నారు.

iPhone 14 : ఐఫోన్ 13 సిరీస్‌కు యాపిల్ అభిమానుల నుంచి మెరుగైన ఆదరణ లభించడంతో రాబోయే ఐఫోన్ సిరీస్‌లపై అంచనాలు ఊపందుకున్నాయి. ఐఫోన్ 14 సిరీస్ ఫీచర్లపై ఓ రేంజ్లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఐఫోన్ 14, ఐఫోన్ 15 పోన్ల కెమెరా స్పెసిఫికేషన్లపై తాజా లీకులు ఉత్కంఠ రేపుతున్నాయి. ప్రముఖ యాపిల్ అనలిస్ట్ మింగ్ చి కూ రాబోయే ఐఫోన్ హాట్ ఫీచర్లపై ఇచ్చిన అంచనాలపై హాట్ డిబేట్ సాగుతోంది. 2022లో రానున్న ఐఫోన్ 14.. 48 మెగాపిక్సెల్ లెన్స్‌తో రానుందని కూ చెబుతున్నారు.

టాప్ఎండ్ ఐఫోన్ 13 మోడల్ ఐఫోన్ 13 ప్రొ మ్యాక్స్‌లో 12 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌లతో పోలిస్తే ఇది భారీ అప్‌గ్రేడ్‌గా చెప్పుకోవచ్చు. ఇటీవలి ఇన్వెస్టర్ నోట్లో కూ ఐఫోన్ 14 కెమెరాపై ఈ అంచనాలు వెల్లడించారు. 9to5Macలో కనిపించే ఈ నోట్లో కూ ఐఫోన్ 15పైనా అంచనాలు వెలువరించారు. 2023లో రానున్న ఐఫోన్ 15లో పెరిస్కోప్ లెన్స్ వాడతారని చెప్పుకొచ్చారు.
iPhone 14 : కెమెరా ఫీచర్లు మారేనా..?
ఆండ్రాయిడ్ మార్కెట్‌తో పోలిస్తే అధిక మెగాపిక్సెల్ కౌంట్ రేసులో యాపిల్ పోటీపడని క్రమంలో కెమెరాకు సంబంధించి తాజా అంచనాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. లేటెస్ట్ ఐఫోన్ సిరీస్ కెమెరాలు ప్రపంచంలోనే అత్యుత్తమైనవని కావడంతో తన కెమెరా మాడ్యూల్స్‌ను యాపిల్ అప్‌గ్రేడ్ చేస్తుందా అనే అనుమానాలూ టెక్ నిపుణుల్లో వ్యక్తమవుతున్నాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Safe Online Transactions | ఈ టిప్స్ పాటిస్తే మీ ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్ సేఫ్.. లేదంటే గోవిందా..?
Shining Mask: కొవిడ్ వైరస్ చేరిందో.. ఈ మాస్క్ మెరుస్తుంది! కనిపెట్టిన జపాన్ శాస్త్రవేత్తలు
Signal | వాట్సప్‌కు దీటుగా దూసుకెళ్తున్న సిగ్నల్.. మరో అద్భుతమైన ఫీచర్
Fake PAN Card | నకిలీ పాన్‌కార్డును గుర్తించడం ఎలా? స్మార్ట్‌ఫోన్ ఉంటే చాలు.. ఇదిగో స్టెప్స్
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

