డైవర్షన్ రాజకీయాలు: మన్నె క్రిశాంక్
తెలంగాణలో తీవ్రమవుతున్న సాగు, తాగునీటి ఎద్దడిని పరిషరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తేతెలంగాణ): తెలంగాణలో తీవ్రమవుతున్న సాగు, తాగునీటి ఎద్దడిని పరిషరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం.. డైవర్షన్ రాజకీయాలకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హైదరాబాద్‌లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. చేతగానితనాన్ని, సొంత వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే రేవంత్ సర్కార్ మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంపై కక్షపూరిత అబద్ధాలను ప్రచారం చేయిస్తున్నదని మండిపడ్డారు.
గతంలో 22ఏ నిషేధిత భూముల వివాదం తలెత్తినప్పుడు కూడా ప్రజల దృష్టిని మళ్లించేందుకే కేసీఆర్ భూములంటూ దుష్ప్రచారం చేశారని తెలిపారు. కొండపోచమ్మ సాగర్ నుంచి కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు నీళ్లు మళ్లిస్తున్నారంటూ అధికారుల ధ్రువీకరణ లేకుండా కాంగ్రెస్‌కు కొమ్ముకాస్తున్న మీడియా బరితెగించి అసత్య కథనాలు ప్రసారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ఎంపీ వివేక్ వెంకటస్వామికి చెందిన ‘వెలుగు’ పత్రిక, ‘వి6’ చానల్‌తో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆరోపించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

