ఇదివరకు సిమ్ కార్డు తీసుకోవాలంటే.. ఏదైనా ఐడెంటిటీ, అడ్రస్ ప్రూఫ్ అడిగేవారు. కానీ.. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవాలంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు ఉండాల్సిందే. ఆధార్ నెంబర్‌తోనే సిమ్ కార్డ్‌ను లింక్ చేసి కొత్త సిమ్ కార్డును జారీ చేస్తున్నాయి టెలికాం కంపెనీలు. అయితే.. చాలామందికి తమ ఆధార్ నెంబర్‌తో ఎన్ని సిమ్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయో తెలియదు. ఆధార్ నెంబర్‌ను మిస్యూజ్ చేసి కూడా సిమ్ కార్డ్స్ తీసుకునేవాళ్లు ఉన్నారు. సైబర్ క్రిమినల్స్ పని అదేకదా.
అందుకే.. ఆధార్ కార్డుతో ఎన్ని సిమ్ కార్డ్స్ లింక్ అయి ఉన్నాయో… రిజిస్టర్ అయి ఉన్నాయో తెలుసుకునేందుకు ఒక వెబ్ సైట్ ఉంది. డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్(డీవోటీ) ఇటీవల ఒక వెబ్ పోర్టల్‌ను లాంచ్ చేసింది. టెలికామ్ అనలిటిక్స్, ఫ్రాడ్ మేనేజ్మెంట్ అండ్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్(టీఏఎఫ్కాప్) పేరుతో లాంచ్ అయిన ఈ వెబ్ పోర్టల్‌లో ఆధార్ కార్డుతో లింక్ అయి ఉన్న ఏదో ఒక మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేసి.. ఓటీపీని వెరిఫై చేయాలి. ఓటీపీని వెరిఫై చేయగానే.. ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్స్ అన్నీ కనిపిస్తాయి. మామూలుగా డీవోటీ రూల్స్ ప్రకారం.. ఒక్క ఆధార్ కార్డు ద్వారా 9 సిమ్ కార్డ్స్ తీసుకోవచ్చు.
వెబ్ పోర్టల్‌లో కనిపించే మొబైల్ నెంబర్స్‌ను ఒకసారి చెక్ చేసుకొని వాటిని వాడుతున్నారో లేదో వెరిఫై చేసుకోవాలి. ఒకవేళ యూజర్లు ఆ నెంబర్‌ను వాడకపోయినా.. ఏదైనా నెంబర్ అనుమానాస్పదంగా ఉన్నా.. వెంటనే ఆ నెంబర్ మీద సెలెక్ట్ చేసి రిపోర్ట్ చేయొచ్చు. దాని మూడు ఆప్షన్లు ఉంటాయి. This is not my, Not required, required.. ఈ మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి.. రిపోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది.
ముందుగా https://tafcop.dgtelecom.gov.in/ అనే వెబ్ సైట్‌ను ఓపెన్ చేసి.. ఆధార్‌తో లింక్ అయి ఉన్న నెంబర్‌ను ఎంటర్ చేయండి. ఆ తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ బటన్ మీద క్లిక్ చేస్తే.. మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయగానే.. మరోపేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ ఆధార్‌తో లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్స్ కనిపిస్తాయి.
వాటిని చెక్ చేసుకొని రిపోర్ట్ చేయాలనుకుంటే అక్కడే రిపోర్ట్ చేయొచ్చు. అవసరం లేని నెంబర్స్‌ను బ్లాక్ చేసుకోవచ్చు. అయితే.. ఈ ఫీచర్ ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సర్కిల్ కస్టమర్లకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. మిగితా రాష్ట్రాల కస్టమర్లకు త్వరలోనే ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొస్తామని డీవోటీ వెల్లడించింది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్ యూజర్లూ.. బైక్‌పై వెళ్తున్నారా? మీ కెమెరా పాడవ్వచ్చు జాగ్రత్త!
CoWIN New API : కోవిన్ యాప్ లో కొత్త అప్ డేట్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటు అది కూడా
Over The Air Wireless Charging : ఒకేసారి 4 ఫోన్లకు చార్జింగ్.. మోటరోలా సరికొత్త ఎయిర్ చార్జర్
WhatsApp : 2021 ముగిసేనాటికి ఈ ఫోన్లలో వాట్సప్ పనిచేయదు.. ఇదిగో ఆ లిస్టు!