CoWIN New API : కోవిన్ యాప్ లో కొత్త అప్ డేట్.. వ్యాక్సిన్ సర్టిఫికెట్ తో పాటు అది కూడా
కోవిన్ యాప్ లో కొత్త అప్ డేట్ | ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఏదైనా ప్రూఫ్
ప్రస్తుతం కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవడం ఎంత ముఖ్యమో.. ఆ వ్యాక్సిన్ సర్టిఫికెట్ తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. వ్యాక్సిన్ వేసుకున్నట్టు ఏదైనా ప్రూఫ్ చూపిస్తేనే కొన్ని రాష్ట్రాలు వేరే రాష్ట్రాల ప్రజలకు అనుమతులిస్తున్నాయి. మాల్స్, పార్క్, ఇతర టూరిస్టు ప్రాంతాల్లో కూడా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను అడుగుతున్నారు. కంపెనీలు కూడా తమ ఉద్యోగులకు వ్యాక్సిన్ వేసుకోవాలని, లేకపోతే ఆఫీసులకు రావద్దని చెబుతున్నాయి. అందుకే.. వ్యాక్సిన్ వేసుకోవడంతో పాటు.. దానికి సంబంధించిన సర్టిఫికెట్ ను కూడా తీసుకోవడం కంపల్సరీ.

అయితే.. కోవిన్ యాప్ లో వ్యాక్సిన్ కోసం రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్ తో లాగిన్ అయితే వ్యాక్సినేషన్ కు సంబంధించిన మొదటి, రెండో డోస్ సర్టిఫికెట్లు ఉంటాయి. వాట్సప్ ద్వారా కూడా కరోనా వ్యాక్సిన్ సర్టిఫికెట్ ను తీసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్, ట్యాబ్లెట్, లాప్ టాప్, పీసీ, డిజిలాకర్ లో సర్టిఫికెట్ ను సేవ్ చేసుకోవచ్చు.
తాజాగా.. కోవిన్ యాప్ లో కొత్త ఏపీఐని తీసుకొచ్చారు. Know Your Customer’s/Client’s Vaccination Status లేదా KYC-VS పేరుతో ఈ అప్ డేట్ ను తీసుకొచ్చారు. దీని ద్వారా.. ఒక వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా? లేదా? అని తెలుసుకునే ప్రక్రియ అని.. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 72 కోట్ల వ్యాక్సిన్ డోస్ లను వేసినట్టు మంత్రిత్వ శాఖ తెలిపింది.

అయితే.. కొన్ని కంపెనీలలో, మాల్స్ లో, ఇతర ప్రదేశాల్లో డిజిటల్ సర్టిఫికెట్ అవసరం లేకుండా.. సంబంధిత వ్యక్తి వ్యాక్సిన్ వేసుకున్నాడా? లేడా? అని మాత్రమే తెలుసుకోవడం కోసం తీసుకొచ్చిందే ఈ కొత్త అప్ డేట్. ఒక కంపెనీ తన ఉద్యోగుల వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా.. ఇండియన్ రైల్వేస్ తమ ప్రయాణికుల వ్యాక్సిన్ స్టేటస్ తెలుసుకోవాలన్నా.. ఈ ఫీచర్ ను ఉపయోగించి తెలుసుకునే అవకాశం ఉంటుంది. హోటల్స్, టూరిస్టు ప్రాంతాలు, ఎయిర్ పోర్ట్స్, బస్ట్ స్టేషన్స్, మెట్రో స్టేషన్స్.. ఇలా పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ ప్రాంతాల్లో కూడా ప్రయాణికుల వ్యాక్సినేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం రూపొందించిందే ఈ ఫీచర్.
ఈ ఏపీఐని ఉపయోగించాలంటే.. వ్యాక్సిన్ సమయంలో రిజిస్టర్ చేసుకున్న మొబైల్ నెంబర్, పేరు ఎంటర్ చేస్తే.. ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేస్తే.. కోవిన్.. ఆ వ్యక్తి వ్యాక్సిన్ స్టేటస్ ను వెరిఫై చేసే ఎంటిటీకి వ్యాక్సిన్ కు సంబంధించిన వివరాలను పంపిస్తుంది.
ఆ వ్యక్తి వ్యాక్సిన్ వేసుకోకపోతే.. Person is not vaccinated అని.. ఒక డోస్ మాత్రమే వేసుకుంటే Person is partially vaccinated అని.. రెండు డోస్ లు వేసుకుంటే.. Person is fully vaccinated అనే మెసేజ్ లను కోవిన్ ఎంటిటీకి పంపిస్తుంది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
Cabinet Expansion | దసరాకు పక్కా అంటూ కాంగ్రెస్ నేతల ప్రచారం.. కానీ ఆ ఊసేలేదు
Polluted Cities | ప్రపంచ అత్యంత కాలుష్య నగరాలు.. ఒక్క భారత్‌లోనే ఎన్ని ఉన్నాయంటే..?
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

