న్యూఢిల్లీ : పిక్సెల్ 6ఏ, పిక్సెల్ 7, పిక్సెల్ 7ఏ సహా గూగుల్ పిక్సెల్ ఫోన్లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డీల్స్‌ను ఆఫర్ చేస్తోంది. 2022లో భారత్‌లో ఫ్లాగ్షిప్ సిరీస్‌గా పిక్సెల్ 7 సిరీస్‌ను గూగుల్ లాంఛ్ చేసింది. ఇక ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7 రూ . 59,999కు లిస్టయింది. అయితే పలు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు వర్తింపచేస్తే పిక్సెల్ 7ను ఫ్లిప్‌కార్ట్‌లో రూ .35,000లోపు సొంతం చేసుకోవచ్చు.
మరోవైపు పిక్సెల్ 6ఏను రూ .16,000కు దక్కించుకునే వెసులుబాటు ఉంది. ఇక పిక్సెల్ 7 ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 59,999కి లిస్టవగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ కార్డుదారులకు రూ .5000 ఇన్స్టంట్ క్యాష్‌బ్యాక్ సదుపాయం ఉండటంతో స్మార్ట్‌ఫోన్ ధర రూ .54,999కి తగ్గుతుంది. ఆపై పాత ఫోన్ ఎక్స్ఛేంజ్పై రూ .3000 ఎక్స్ఛేంజ్ బోనస్‌తో పాటు రూ. 23,000 వరకూ ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ పొందడంతో పిక్సెల్ 7ను ఏకంగా రూ .31,000కే సొంతం చేసుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 7 వంటి డివైజ్‌ను దక్కించుకునేందుకు ఇదే సరైన అవకాశమని టెక్ నిపుణులు చెబుతున్నారు. గూగుల్ పిక్సెల్ 7 6.32 ఇంచ్ డిస్ప్లేతో టెన్సర్ జీ2 చిప్సెట్తో కస్టమర్ల ముందుకొచ్చింది. ఈ హాట్ డివైజ్ వైర్లెస్ చార్జింగ్ సపోర్ట్‌తో 4355ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగిఉంది. గూగుల్ పిక్సెల్ 7 50 ఎంపీ ప్రైమరీ కెమెరా, 12 ఎంపీ సెన్సర్ సహా ముందుభాగంలో 10.8 ఎంపీ సెల్ఫీ కెమెరాతో కస్టమర్లను ఆకట్టుకుంటోంది.