Google Chrome | గూగుల్ క్రోమ్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Google Chrome | ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ ఇన్)
Google Chrome | గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడుతున్నారా? అయితే.. మీ కంప్యూటర్ లేదా మొబైల్‌ను మీరే సైబర్ దాడులకు చాన్స్ ఇచ్చినట్టు అవుతుంది. అవును.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్లో ఉన్న చిన్న చిన్న ఎర్రర్సే సైబర్ దాడులకు అవకాశంగా మారుతోంది.
ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సీఈఆర్టీ ఇన్) ఏజెన్సీ తాజాగా ఇచ్చిన సమాచారం మేరకు గూగుల్ క్రోమ్ బ్రౌజర్ వాడే యూజర్ల సిస్టిమ్స్‌ను సైబర్ క్రిమినల్స్ ఈజీగా హ్యాక్ చేయగలుగుతున్నారట. టార్గెట్ చేసుకొని మరీ అటాక్ చేస్తున్నారట. అటువంటి చాన్స్ సైబర్ క్రిమినల్స్‌కు ఇవ్వకుండా ఉండాలంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ను వెంటనే అప్డేట్ చేసుకోవాలని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ స్పష్టం చేసింది. ఆర్బిట్రరీ కోడ్‌ను ఉపయోగించుకొని హ్యాకర్ గూగుల్ క్రోమ్ ద్వారా సిస్టమ్‌లోకి ప్రవేశిస్తున్నట్టు రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది. క్రోమ్ 98 బ్రౌజర్లో ఉన్న బగ్స్‌ను ఇటీవలే గూగుల్ ఫిక్స్ చేసింది.
Google Chrome | గూగుల్ క్రోమ్ 98 వర్షన్‌కు వెంటనే అప్డేట్ చేసుకోవాలి
గూగుల్ క్రోమ్ వర్షన్ 98.0.4758.80 కంటే ముందు వర్షన్ వాడుతున్న వాళ్లు మాత్రం వెంటనే అప్డేట్ చేసుకోవాలి. ఆ వర్షన్లలోనే బగ్స్ ఉన్నాయి. విండోస్‌తో పాటు మాక్ ఓఎస్, లైనన్స్ యూజర్లకు గూగుల్ క్రోమ్ 98 కొత్త అప్డేట్ వర్షన్‌ను ఫిక్స్ చేసింది. దాంట్లో 27 సెక్యూరిటీ ఫిక్స్‌లను జతచేసింది.
గూగుల్ క్రోమ్ అప్డేట్ను ముందే ఆటోమెటిక్‌గా పెట్టుకుంటే.. క్రోమ్ ఆటోమెటిక్‌గా అప్డేట్ అవుతుంది. ఒకవేళ ఆటోమెటిక్ అప్డేట్ కాని యూజర్లు.. గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్(Chrome) ఆప్షన్‌లోకి వెళ్లి.. About Google Chrome అనే ఆప్షన్‌ను క్లిక్ చేసి.. అప్డేట్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ వర్షన్‌ను వాడాలంటే.. డౌన్లోడ్ పూర్తయ్యాక.. బ్రౌజర్‌ను రీలాంచ్ చేయాల్సి ఉంటుంది.
Follow us on Google News, Facebook, Twitter , Instagram, Youtube
Read More :
Realme C35 | 50 ఎంపీ కెమెరాతో రానున్న రియల్మీ సీ35.. లాంచ్ ఎప్పుడంటే?
WhatsApp | సూపర్ ఫీచర్‌ను తీసుకురాబోతున్న వాట్సప్.. డెస్క్‌టాప్ వర్షన్ కోసమే.. అదేంటో తెలుసా?
Telegram | టెలిగ్రామ్‌లో మెసేజ్ ట్రాన్స్లేషన్ ఈజీ.. ఎలాగంటే?!
QR Code | ప్రాణాలను కాపాడుతున్న క్యూఆర్ కోడ్.. ఎలాగంటే..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

