Telegram | మెసెజింగ్ యాప్‌ల్లో టెలిగ్రామ్ యూజర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త ఫీచర్లను అందుబాటులోకి తెస్తున్నది. ఇటీవల యాప్‌లో ట్రాన్స్లేషన్ ఫీచర్ పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో టెలిగ్రామ్ యూజర్లు తమకు చాట్ లేదా గ్రూప్‌లో వచ్చే మెసేజ్‌లు ఇక నుంచి తమకు ఇష్టమైన భాషలో చదువుకునే వెసులుబాటు ఉంటుంది. ఈ ఫీచర్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు లభ్యం అవుతుంది. ట్రాన్స్లేషన్ ఫీచర్‌తో యూజర్లు మరింత సులువుగా తమ సేవలను పొందగలరని టెలిగ్రామ్ తెలిపింది.
ఈ ట్రాన్స్లేషన్ ఫీచర్ యాక్టివేట్ చేయడానికి ముందుగా టెలిగ్రామ్ యాప్ ప్రొఫైల్ సెట్టింగ్స్‌లో లాంగ్వేజ్ బటన్‌పై క్లిక్ చేయాలి. షో ట్రాన్స్లేషన్ బటన్ కనిపిస్తుంది. దాన్ని ఎనేబుల్ చేస్తే 18 అంత్జాతీయ భాషల జాబితా కనిపిస్తుంది. ఆ జాబితాలో మీకు ఇష్టమైన భాషను ఎంచుకుంటే.. మీకొచ్చిన మెసేజ్.. ఆ భాషలోకి మారుతుంది. తెలియని భాషలో మెసేజ్ వచ్చినా ఇంగ్లిష్‌లోకి ట్రాన్స్‌లేట్ చేస్తుంది. అయితే, టెలిగ్రామ్ యాప్ ట్రాన్స్లేషన్ భాషల్లో ఇండియన్ లాంగ్వేజెస్ లేక పోవడం గమనార్హం.
షో ట్రాన్స్లేషన్ ఆప్షన్ కింద డునాట్ ట్రాన్స్‌లేట్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. దానిపై క్లిక్ చేసినా ఆయా భాషల జాబితా ఉంటుంది. మీకు ట్రాన్స్లేషన్ అవసరంలేని భాషను ఎంచుకుంటే.. మీకొచ్చే మెసేజ్‌లు ఆ భాషలోకి ట్రాన్స్‌లేట్ కావు. ట్రాన్స్లేషన్ ఆప్షన్ ఎనేబుల్ చేసిన తర్వాత చాట్ గానీ, గ్రూప్‌లోని ఏదైనా మెసేజ్‌పై క్లిక్ చేస్తే పాప్-అప్ విండోలో కనిపించే ట్రాన్స్లేషన్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీరెంచుకున్న భాషలోకి సదరు మెసేజ్ ట్రాన్స్లేటవుతుంది.