న్యూయార్క్ : గత ఏడాది నవంబర్‌లో ఇంటరాక్టివ్ ఏఐ టూల్ చాట్‌జీపీటీ రాకతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్ ప్రపంచంలో హాట్ డిబేట్‌గా మారింది. ఈ ఏఐ టూల్ మనిషి తరహాలో ప్రశ్నలకు స్పందించడం సహా మ్యూజిక్ కంపోజ్ చేయడం, కవిత్వం రాయడం, సంక్లిష్ట మ్యాథ్స్ సమస్యలను సాల్వ్ చేయడం వంటి అనేక టాస్క్‌లను చిటికెలో చక్కపెడుతుండటంతో చాట్‌జీపీటీకి విశేష ఆదరణ లభించింది.
క్రమంగా మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి ఇతర కంపెనీలు తమ సొంత ఏఐ చాట్‌బాట్స్‌ను ఆవిష్కరించాయి. ఏఐలో ఈ పరిణామాలన్నీ లేటెస్ట్ టెక్నాలజీ భవిష్యత్‌లో ఎలాంటి విపరిణామాలకు దారితీస్తుందనే ఆందోళనా టెక్ నిపుణుల్లో వ్యక్తమైంది. ఏఐతో కొలువుల కోత తప్పదని, మానవాళి విధ్వంసానికీ ఇది దారితీస్తుందని పలువురు హెచ్చరించగా, మరికొందరు ఏఐతో ఉత్పాదకత పెరుగుతుందని, ఆరోగ్య రంగంలోనూ పెను మార్పులతో మానవాళి జీవితం సుఖమయం అవుతుందని చెబుతున్నారు.
ఇక ఉగ్రవాదులు, నేరగాళ్లు ఏఐని తమ చేతుల్లోకి తీసుకుని విధ్వంసానికి పూనుకోలేరని మెటా చీఫ్ ఏఐ సైంటిస్ట్ యాన్ లికున్ చెప్పారు. వారి వద్ద తగినన్ని వనరులు, నైపుణ్యాలు లేకపోవడంతో ఏఐని తమ ఆధీనంలోకి తీసుకోలేదరని పేర్కొన్నారు. చైనా సహా సంపన్న రాజ్యాలు కూడా ఓపెన్ సోర్స్ ఏఐని నియంత్రించే పరిస్ధితి లేదని ఆయన వివరించారు.
Read More :