Solar Eclipse | ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఈ నెల 30న ఏర్పడనున్నది. ఇది తొలి పాక్షక సూర్యగ్రహణం కాగా.. దక్షిణ అమెరికాలోని దక్షిణాది ప్రజలు, అంటార్కిటికా, దక్షిణ మహా సముద్ర ప్రాంతాల వాసులు సూర్యాస్తమయానికి కొద్ది సమయం ముందు పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడొచ్చని నానా పేర్కొంది. చిలీ, ఉరుగ్వే, పశ్చిమ పర్వాగ్వే, అర్జెంటీనీ, నైరుతి బొలీవియా, ఈశాన్యలోని పెరూ, నైరుతి బ్రెజిల్ దేశాలలో ఆకాశం నిర్మలంగా ఉంటే.. సూర్యాస్తమయం సమయంలో గ్రహణం కనిపిస్తుందని పేర్కొంది.
అయితే, సూర్యగ్రహణం భారత్లో కనిపించదని నాసా శాస్త్రవేత్తలు తెలిపారు. దక్షిణ, అమెరికాలోని సౌత్ ఈస్టర్న్ ప్రాంతాల్లో, దక్షిణ పసిపిక్ మహా సముద్ర ప్రాంతాల వాసులకు ఈ సూర్యగ్రహణం కనిపించనుందని వివరించారు. శనివారం మధ్యాహ్నం 12.15 గంటలకు సూర్యగ్రహణం ప్రారంభమై.. మే 1న ఉదయం 04.07 గంటలకు ముగుస్తుందని పేర్కొంది. అయితే, గ్రహణ సమయంలో భారత్లో రాత్రి అవుతుందని తెలిపారు.