INDW vs PAKW | రేపే దాయాదుల మ్యాచ్.. ఈసారైనా పాక్ పోటీ ఇచ్చేనా..!
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానులు అసక్తి కనబరుస్తున్న దాయాదుల మ్యాచ్ శనివారమే జరుగనుంది.
INDW vs PAKW : మహిళల ఆసియా కప్‌లో భారత్(India), పాకిస్థాన్(Pakistan) మ్యాచ్‌కు కౌంట్‌డౌన్ మొదలైంది. అభిమానులు అసక్తి కనబరుస్తున్న దాయాదుల మ్యాచ్ శనివారమే జరుగనుంది. అంతర్జాతీయ వేదికలపై మాత్రమే తలపడుతున్న ఇరుజట్లు గెలుపుపై ధీమాతో ఉన్నాయి. అయితే.. రికార్డులు మాత్రం టీమిండియా ఆధిపత్యాన్ని స్పష్టం చేస్తున్నాయి. మెగా ఈవెంట్లలో ఒత్తిడికి తలొగ్గే పాక్ పటిష్టమైన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన చేతిలో మరోసారి చతికిలపడడం ఖాయమనిపిస్తోంది.
అంతర్జాతీయంగా మరోసారి భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు సమయం ఆసన్నమైంది. ఈసారి మహిళల ఆసియా కప్‌లో దాయాది జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. సెప్టెంబర్ 5, శనివారం దుబాయ్ ఇంటర్నేషన్ స్టేడియంలో ఇరుజట్ల మ్యాచ్ ప్రేక్షకులకు ఫుల్ థ్రిల్ ఇవ్వనుంది. ఈమధ్య వరసగా టీ20 ప్రపంచకప్, వన్డే వరల్డ్‌కప్‌లో టీమిండియా చేతిలో కంగుతిన్న పాక్ ప్రతీకారంతో రగిలిపోతోంది.
Pakistan have only beaten India once at the Women’s T20 Asia Cup – a 13-run victory in Sylhet in 2022
Can they do it again tomorrow in Dubai? #AsiaCup2026 pic.twitter.com/p3aLWQKMNL
— Cricinfo (@cricinfo) September 4, 2026
కానీ, పలుమార్లు విజయంతో చిరకాల ప్రత్యర్థి తమకు పోటీయే కాదని నిరూపించిన భారత్ మరోసారి గెలుపుపై ధీమాతో ఉంది. ఈ నేపథ్యంలో.. రికార్డులను తిరగేస్తే.. 14 సార్లు పాక్‌పై మన అమ్మాయిలదే పైచేయి. ఇరుజట్లు 17 పర్యాయాలు ఢీకొనగా.. టీమిండియా 14 దఫాలు విక్టరీ కొట్టింది. ఇక టీ20 ఫార్మాట్లో జరిగిన ఆసియా కప్‌లో ఏకంగా ఆరుసార్లు విజయం మనోళ్లదే. పాక్ చేతిలో ఒకేఒక మ్యాచ్ ఓడింది భారత్. అందుకే కాబోలు.. పాక్‌పై ఎప్పుడైనా మాదే పైచేయి అని ఆల్‌రౌండర్ దీప్తి శర్మ(Deepti Sharma) పేర్కొంది. పహల్గాం ఉగ్రదాడి, ‘ఆపరేషన్ సిందూర్’ అనంతర పరిణామాలతో టాస్ సమయంలో భారత్, పాక్ కెప్టెన్లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం లేదు. ఆసియా కప్‌లోనూ అదే తీరుగా వ్యహరిస్తారా? అనేది ఆసక్తి రేపుతోంది.
భారత స్క్వాడ్ : స్మృతి మంధాన, షఫాలీ వర్మ, ప్రతీకా రావల్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), భారతి ఫుల్మాలి, రీచా ఘోష్(వికెట్ కీపర్), దీప్తి శర్మ, ప్రేమా రావత్, నందిని శర్మ, శ్రీ చరణి, క్రాంతి గౌడ్, జి.కమలిని(వికెట్ కీపర్), రేణుకా సింగ్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్.
పాకిస్థాన్ స్క్వాడ్ : మునీబా అలీ(వికెట్ కీపర్), షవాల్ జుల్ఫికర్, గుల్ ఫిరోజా, అయేషా జఫర్, సడాఫ్ షమాస్, ఫాతిమా సనా(కెప్టెన్), ఎమ్ ఈ హనీ, ఎమాన్ ఫాతిమా, టుబా హసన్, నష్రా సంధు, సడియా ఇక్బాల్, సైరా జుబీన్, మొమినా రియాసత్, ఎమాన్ నసీర్, వహీదా అక్తర్.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
Obsession | రూ.2500 కోట్లకు పైగా వసూళ్లు.. ఓటీటీలోకి రాబోతున్న ‘అబ్సెషన్ అన్‌కట్ వెర్షన్’
Balen Shah | నేపాల్ ప్రధానిగా కొత్త ఒరవడి.. చైనాకు షాకిస్తూ భారత్‌కు ఓటేసిన బాలెన్ షా..!
AP News | ఏపీలోని పలు జిల్లాలకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

