Lunar Eclipse | నేడు ఈ ఏడాది సంపూర్ణ చంద్రగ్రహణం.. భారత్‌లో కనిపిస్తుందా?
న్యూఢిల్లీ : ఏడాది తొలి సంపూర్ణ చంద్రగహణం ఆది, సోమవారాల్లో ఏర్పడనున్నది. ఈస్టర్న్ స్టాండర్డ్ టైం ప్రకారం ఇవాళ రాత్రి 10.27 గంటలకే ప్రారంభమై అర్ధరాత్రి దాటాక 12.53 గంటల వరకు కొనసాగనున్నది. భారతకాలమాన ప్రకారం.. సోమవారం ఉదయం 7.57 గంటల నుంచి 10.15 గంటల వరకు ఉండనుంది. చంద్రుడు పూర్తిగా గ్రహణంలోకి వెళ్లిపోయే ముందు ఎర్రటి మారిపోతాడని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. దీన్ని బ్లడ్బూన్గా పిలుస్తుంటారు. సూర్యుడి కిరణాలు భూమిని తాకినప్పుడు నీలం, ఆకుపచ్చ రంగులు మాత్రం చెల్లాచెదురవుతాయని, ఎరుపు, నారింజ రంగులు మాత్రం కనిపిస్తాయని, అందుకే మనకు చంద్రుడు ఎర్రగా కనిపిస్తాడని తెలిపారు.

గ్రహణం సమయంలో చంద్రుడు కొద్దిసేపు కనిపించకపోతాయని చెప్పారు. శాస్త్రీయంగా గ్రహణం అనేది ఖగోళ సంఘటన కాగా.. భూమి, సూర్యుడు, చంద్రుడు ఒకే సరళ రేఖపైకి వచ్చిన సమయంలో గ్రహణాలు ఏర్పడతాయని.. చంద్రునికి, సూర్యునికి మధ్యగా భూమి వచ్చి.. ఆ నీడ చంద్రుడిపై పడినప్పుడు చంద్ర గ్రహణంగా పేర్కొంటారు. అయితే, గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని తెలిపారు. సంపూర్ణ చంద్రగ్రహణం చాలా తక్కువ సమయం మాత్రమే ఉంటుందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ఈ గ్రహణం దక్షిణ అమెరికా, యూరప్, మధ్య-ప్రాచ్య దేశాల్లోని కొన్ని ప్రాంతాల్లో ‘బ్లడ్ రెడ్’ కనిపిస్తుందని, రోమ్, బ్రస్సెల్స్, లండన్, ప్యారిస్, హవానా, జోహన్నెస్‌బర్గ్, లాగోస్, మాడ్రిడ్, మాడ్రిడ్, శాంటియాగో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్, గ్వాటెమాల సిటీ, రియో డి జెనీరో, చికాగోలో సంపూర్ణ గ్రహణం కనిపిస్తుందని, అంకారా, కైరో, హోనోలులు, బుడాపెస్ట్, ఏథెన్స్‌లలో పాక్షిక గ్రహణం కనిపిస్తుందని నిపుణులు పేర్కొన్నారు. అయితే, భారత్‌లో మాత్రం చంద్రగ్రహణం కనిపించని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం కాగా, రెండో గ్రహణం నవంబర్ 8న కనువిందు చేయనున్నది.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Raja Saab | ‘రాజా సాబ్’ ఫ్లాప్‌కు అదే ప్రధాన కారణం.. తొలిసారి అసలు విషయం చెప్పిన నిర్మాత టీజీ విశ్వప్రసాద్!
Pope Leo XIV: పోప్ లియోకు ఊపిరితిత్తుల క్యాన్సర్.. సర్జరీతో కణితి తొలగింపు
CJP Leaders: జంతర్ మంతర్‌లోకి చొరబాటు.. 5 రోజుల కస్టడీలోకి సీజేపీ నేతలు
జగిత్యాల జిల్లాలో విషాదం.. వ్యవసాయ బావిలో పడి ఇద్దరు యువకులు మృతి
Cult | ‘కల్ట్’ వాయిదా పడినట్టేనా .. విశ్వక్ సేన్ సినిమా రిలీజ్‌పై ఇంకా రాని క్లారిటీ!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

