హైదరాబాద్ : నైపుణ్యాలను అందిపుచ్చుకుంటే కెరీర్లోనిలకడగా ఎదగవచ్చని తెలంగాణకు చెందిన రైతు బిడ్డ నిరూపించాడు. ఏఐ (AI ), మెషీన్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్, రోబోటిక్స్ వంటి నూతన టెక్నాలజీల రాకతో ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వారికి కొలువుల మార్కెట్ రెడ్ కార్పెట్ పరుస్తుంది. న్యూ టెక్నాలజీలను అందిపుచ్చుకుని అప్‌గ్రేడ్ అయితే కెరీర్లో ఎదుగుదల ఉంటుందని పసిగట్టిన వరంగల్ జిల్లాకు చెందిన జరుపుల ప్రేమ్ కుమార్ తన స్కిల్స్‌కు పదునుపెట్టుకుని రాణించాడు.
మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుమార్ తండ్రి రైతు కాగా తల్లి గృహిణి. దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన కుమార్ పట్టుదలతో కెరీర్లో వృద్ధి చెందాడు. గోకరాజు రంగరాజు ఇంజనీరింగ్ కాలేజీ నుంచి బీటెక్ డిగ్రీ పొందిన కుమార్ తొలుత రెండేండ్ల పాటు టీసీఎస్‌లో టెస్ట్ డేటా ఇంజనీర్‌గా పనిచేశాడు. టీసీఎస్ నింజా క్యాంపస్ రిక్రూట్మెంట్ ద్వారా ఎలాంటి గతానుభవం లేని కుమార్‌కు ఈ అవకాశం లభించింది. అప్పుడే న్యూ టెక్నాలజీలపై పట్టు సాధించడం, నైపుణ్యాలకు పదును పెట్టుకోవడం కీలకమని కుమార్ గ్రహించాడు. అదేసమయంలో రైతు కుటుంబ నేపధ్యం కావడంతో రైతుల శ్రమ తగ్గించేందుకు అవసరమయ్యే పరికరాల అభివృద్ధికి లేటెస్ట్ టెక్నాలజీని వాడటంపై ఆసక్తి పెంచుకున్నాడు.
ఈ క్రమంలో తన నైపుణ్యాలకు పదును పెట్టుకునేందుకు ఆన్లైన్లో ఏఐ, మెషిన్ లెర్నింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందాడు. కోర్సులో భాగంగా ముందుగా రికార్డు చేసిన వీడియోలతో బోధించడంతో పాటు వారాంతాల్లో రెండు గంటల లైవ్ సెషన్స్ ఉండేవి. ఈ కోర్సు ద్వారా కుమార్‌కు టీవీఎస్ మోటార్స్‌లో డేటా ఇంజనీర్‌గా వంద శాతం వేతన పెంపుతో కొలువు దక్కింది. టెక్నాలజీని మెరుగుపరుచుకోవడం ద్వారా మనం అవుట్‌డేటెడ్ కాకుండా నిరోధించవచ్చని, పరిశ్రమతో అనుసంధానం మెరుగై డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌పై అవగాహన పెరుగుతుందని కుమార్ చెప్పుకొచ్చాడు. మన నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటే అత్యధిక వేతనాలను ఆఫర్ చేసే డేటా సైంటిస్ట్, డేటా అనలిస్ట్, మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వంటి ఉద్యోగాల్లో కుదురుకోవచ్చని కుమార్ తెలిపాడు.
Read More