న్యూఢిల్లీ : అత్యంత వేగంగా జనాదరణ పొందిన యాప్ చాట్‌జీపీటీకి (ChatGPT) దీటుగా ఓపెన్ఏఐ మాజీ ఉద్యోగులు మరో ఏఐ టూల్‌తో ముందుకొచ్చారు. చాట్‌జీపీటీకి పోటీగా వారు నూతన ఏఐ చాట్‌బాట్ క్లాడ్‌ను ప్రారంభించారు. క్లాడ్‌తో సులభంగా సంభాషించవచ్చని, ఎలాంటి హానికారక అవుట్‌పుట్స్ ఇచ్చే అవకాశం దీంతో చాలా తక్కువని కంపెనీ పేర్కొంది. తక్కువ శ్రమతో కోరుకున్న ఫలితాలను క్లాడ్‌తో సాధించవచ్చని తెలిపింది.
చాట్‌జీపీటీకి ఇప్పటికే గూగుల్ బార్డ్ ఏఐ, మైక్రోసాఫ్ట్ బింగ్ వంటి ఏఐ టూల్స్ నుంచి పోటీ ఎదురవుతుండగా తాజాగా క్లాడ్ ఈ జాబితాలో చేరింది. చాట్‌జీపీటీ ఫంక్షన్స్ అన్నింటినీ క్లాడ్ కలిగిఉందని ప్రమోటర్లు చెబుతున్నారు.ఓపెన్ఏఐ ఉద్యోగులు అంథోర్పిక్ అనే కంపెనీగా ఏర్పడి క్లాడ్, క్లాడ్ ఇన్స్టంట్ అనే రెండు వేరియంట్లను అభివృద్ధి చేశారు.
క్లాడ్ అత్యాధునిక టెక్నాలజీతో కూడిన హై పెర్పామెన్స్ మోడల్ అని కంపెనీ బ్లాగ్‌పోస్ట్‌లో పేర్కొంది. క్లాడ్ ఇన్స్టంట్ తేలికైన, తక్కువ ఖర్చుతో కూడిన అత్యంత వేగవంతమైన ఆప్షన్‌గా అభివర్ణించింది. రాబోయే వారాల్లో తాము మరిన్ని అప్డేట్స్ను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపింది. ఈ సిస్టమ్స్‌ను తాము మరింత మెరుగ్గా పనిఏసేలా మరింత సహాయకారిగా, నిజాయితీతో కూడిన ఎలాంటి హాని తలపెట్టని ప్రోడక్ట్స్‌గా మలిచేందుకు నిరంతరం కృషి చేస్తామని కంపెనీ వెల్లడించింది. చాట్‌జీపీటీ కంటే క్లాడ్ మెరుగైన ఇంటరాక్టివ్, ఉత్తమమైన సంభాషణా సామర్ధ్యాలను కలిగిఉందని తెలిపింది.
Read More :