HP Laptop | భారత్‌లోకి బడ్జెట్ ఫ్రెండ్లీ లాప్టాప్.. స్పెషల్లీ విద్యార్థుల కోసమేనన్న హెచ్‌పీ.. దీని ధరెంతంటే?
HP Laptop | కళాశాల విద్యార్థుల కోసం ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ స్పెషల్‌గా డిజైన్ చేసిన లాప్టాప్ ‘క్రోమ్‌బుక్ 15.6’ తీసుకొచ్చింది. దీంతో స్మార్ట్‌గా లెర్నింగ్‌కు ప్రోత్సాహంగా, ైస్టెల్‌గా విద్యార్థులకు సూటబుల్‌గా ఉంటుంది. బడ్జెట్ ఫ్రెండ్లీగా రూ.28,999లకే ఈ లాప్టాప్ సొంతం చేసుకోవచ్చు.
HP Laptop | ప్రముఖ టెక్ దిగ్గజం హెచ్‌పీ (Hewlett-Packard HP) కళాశాల విద్యార్థుల కోసం బడ్జెట్ ఫ్రెండ్లీ స్పెషల్ లాప్టాప్ అందుబాటులోకి తెచ్చింది. హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 (HP Chromebook 15.6) పేరిట మంగళవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది. పాఠశాల, కళాశాల విద్యార్థుల ఆకాంక్షలకు అనుగుణంగా స్టయిలిష్‌గా తీర్చిదిద్దినట్లు తెలిపింది. చదువు, కోర్సుల ట్రైనింగ్‌తోపాటు గేమింగ్‌కు కూడా ఈ లాప్టాప్ సపోర్ట్‌గా నిలుస్తుందని పేర్కొంది. రెండు రంగుల్లో వినియోగదారులకు అందుబాటులో ఉంది. ఫారెస్ట్ టీల్, మినరల్ సిల్వర్ రంగుల్లో లభిస్తుంది. ఈ లాప్‌టాప్‌ను రూ.28,999లకు సొంతం చేసుకోవచ్చు. ఆసక్తి గల యూజర్లు ఆన్లైన్లో కొనుగోలు చేయొచ్చునని హెచ్‌పీ వెల్లడించింది.
హెచ్‌పీ ఇండియా పర్సనల్ సిస్టమ్స్ సీనియర్ డైరెక్టర్ విక్రమ్ బేడీ స్పందిస్తూ.. ‘ఇంటి వద్ద, తరగతి గదిలో చదువుకునే విద్యార్థులకు కనెక్టివిటీ, ప్రొడక్టివిటీ పెంచేందుకు వీలుగా మా న్యూ క్రోమ్‌బుక్ 15.6 లాప్టాప్ డిజైన్ చేశాం. ఇది యువ విద్యార్థుల అవసరాలకు సూటబుల్‌గా, స్టయిలిష్‌గా ఉంటుంది’ అని తెలిపారు.
ఇవీ స్పెషిఫికేషన్స్..
- ఇంటెల్ సెలెరోన్ ఎన్-4500 ప్రాసెసర్ వినియోగం.
- 15.6-అంగుళాల హెచ్డీ స్క్రీన్‌తోపాటు 250 నిట్స్ పీక్ బ్రైట్నెస్ లభ్యం.
- వీడియో కాల్స్ కోసం వైడ్ విజన్ హెచ్డీ కెమెరా, మైక్రో ఫోన్.
- ఫ్రీగా గూగుల్ అసిస్టెంట్, గూగుల్ క్లాస్రూమ్ యాక్సెస్.
- వేగంగా ఫొటోలు, ఫైల్స్ పంపడానికి హెచ్‌పీ క్విక్ డ్రాప్ ఫెసిలిటీ
- వేగవంతమైన, శక్తిమంతమైన కనెక్టివిటీ కోసం వై-ఫై 6 వర్షన్
- మైక్రోసాఫ్ట్ 365కి సపోర్టివ్, 11 గంటల పాటు బ్యాటరీ పని చేస్తుంది.
- హైబ్రీడ్ వర్క్‌కు వెసులుబాటుగా హెచ్‌పీ క్రోమ్‌బుక్ 15.6 లాప్టాప్.
- 27 శాతం అదనంగా లార్జ్ ట్రాక్ ప్యాడ్ ఫీచర్.
- ఫాస్టర్, స్మార్టర్ లెర్నింగ్‌కు ప్రోత్సాహకరం.
- మ్యూజిక్ వింటూనే ప్రెజెంటేషన్ సమర్పించొచ్చు.
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

