SpaceX rocket : ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ‘స్పేస్ఎక్స్ (SpaceX)’ అంతరిక్ష సంస్థ చరిత్ర సృష్టించేందుకు సిద్ధమైంది. తొలిసారి అంతరిక్షంలో ప్రైవేట్ స్పేస్‌వాక్ నిర్వహించేందుకుగానూ ‘పోలారిస్ డాన్ (Polaris Dawn)’ ప్రాజెక్టు కింద నలుగురు వ్యోమగాములను నింగిలోకి పంపింది. ఈ మేరకు ఫ్లోరిడాలో కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ఫాల్కన్-9 రాకెట్ దూసుకెళ్లింది.
ఈ మిషన్‌కు వ్యాపారవేత్త జేర్డ్ ఇస్సాక్‌మన్ నేతృత్వం వహిస్తున్నారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్ మాజీ ఉద్యోగి స్కాట్ కిడ్ దీనికి పైలట్‌గా వ్యవహరిస్తున్నారు. వారితోపాటు స్పేస్ఎక్స్కు చెందిన మిషన్ ఇంజినీర్లు సారా గిల్లి, అన్నా మెనోన్ ఉన్నారు. పోలారిస్ మిషన్‌లో తలపెట్టిన మూడు మానవసహిత యాత్రల్లో ఇది మొదటిది. ఈ ప్రాజెక్టులో మొత్తం స్పేస్ఎక్స్ పరికరాలనే వినియోగిస్తారు.