వాషింగ్టన్: ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ వచ్చే ఏడాది “డోజ్-1 మిషన్ టు ద మూన్” లాంచ్ చేయనుంది. అయితే దీనికి క్రిప్టోకరెన్సీ అయిన డోజ్‌కాయిన్‌లో పేమెంట్ అంగీకరిస్తామని మస్క్ వెల్లడించారు. అయితే ఈ మిషన్‌కు ఎంత వసూలు చేస్తున్నారన్నది మాత్రం చెప్పలేదు. డోజ్-1ను చంద్రుడిపైకి పంపేందుకు మేము చాలా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నాం అని స్పేస్ ఎక్స్ కమర్షియల్ సేల్స్ వీపీ టామ్ ఒచినెరో చెప్పారు. భూకక్ష్యను దాటిని క్రిప్టోకరెన్సీ వాడకానికి ఈ మిషన్ నిదర్శనంగా నిలుస్తుందని ఆయన అన్నారు.
ఈ మిషన్‌ను వచ్చే ఏడాది లాంచ్ చేయబోతున్నాం. ఈ మిషన్‌కు డోజ్లోనే చెల్లిస్తాం. స్పేస్‌లో తొలి క్రిప్టో, తొలి మీమ్ అని మస్క్ ట్వీట్ చేశారు. ప్రపంచమంతా క్రిప్టోకరెన్సీపై వెనుకాముందూ అవుతున్న వేళ మస్క్ దానిని ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే బిట్కాయిన్లోనూ ఆయన ఇన్వెస్ట్ చేశారు. ఆయన ట్వీట్లతో క్రిప్టోకరెన్సీల విలువ భారీగా పెరిగిపోయింది. తన టెస్లా కార్లకు కూడా క్రిప్టోకరెన్సీలో పేమెంట్ అంగీకరిస్తున్నారు.
SpaceX launching satellite Doge-1 to the moon next year
— Elon Musk (@elonmusk) May 9, 2021
– Mission paid for in Doge
– 1st crypto in space
– 1st meme in space
To the mooooonnn!!https://t.co/xXfjGZVeUW