Smart Gadgets for Home | ఈ డివైజ్లతో మీ ఇంటిని స్మార్ట్ హోమ్‌గా మార్చేసుకోండి
Smart Gadgets for Home | ఫోన్ ఇప్పటికే స్మార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటి వంతు. స్వీట్ హోమ్‌ను స్మార్ట్‌హోమ్‌గా మార్చే రకరకాల గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంటి ముందు పూల కుండీలు మొదలు బెడ్రూమ్లోని అద్దం దాకా.. సకలం స్మార్ట్గాతయారవుతున్నాయి.
Smart Gadgets for Home | ఫోన్ ఇప్పటికే స్మార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటి వంతు. స్వీట్ హోమ్‌ను స్మార్ట్‌హోమ్‌గా మార్చే రకరకాల గ్యాడ్జెట్స్ మార్కెట్లోకి వస్తున్నాయి. ఇంటి ముందు పూల కుండీలు మొదలు బెడ్రూమ్లోని అద్దం దాకా.. సకలం స్మార్ట్గాతయారవుతున్నాయి.
అద్దం వెలుగుతుంది
ముఖం మీద నల్లటి నీడ పడే ఇబ్బంది లేకుండా ముఖాన్ని స్పష్టంగా మంచి వెలుతురులో చూసుకోగలిగేలా మార్కెట్లోకి వస్తున్నాయి బ్లూటూత్ మిర్రర్స్. ఇందులో ఉండే లైట్లు మన మీద సహజ కాంతి పడేలా చేస్తాయి. అప్పుడు ముఖానికి, కళ్లకు ఎలాంటి మేకప్ అయినా సులభంగా వేసుకోవచ్చు. బ్లూటూత్ కనెక్ట్ చేసుకుని ఈ అద్దంలో పాటలు కూడా వినొచ్చు. ఇవి కాకుండా కంటికి ఐషాడోలాంటివి ఐప్లె చేస్తున్నప్పుడు కనురెప్పలు స్పష్టంగా పెద్దగా కనిపించేలా చేసే మాగ్నిఫైయింగ్ ఆప్షన్ కూడా ఉంటుంది. చర్మానికి సంబంధించిన సమస్యల్ని, శరీర ఫిట్‌నెస్‌ని గుర్తించి సలహాలిచ్చేలానూ పనిచేసే స్మార్ట్ మిర్రర్లు ఇప్పుడిప్పుడే మార్కెట్లో అడుగు పెడుతున్నాయి.
అలారంతో సూర్యోదయం
నిద్ర లేపేందుకు పెట్టుకునే అలారం ఇప్పుడు సూర్యోదయాన్ని తలపిస్తుంది. సన్‌రైజ్ అలారం క్లాక్‌లు, మనం కావాలనుకున్న వేళకు మెచ్చిన శబ్దాన్ని వినిపించడమే కాదు, నిద్ర లేచేందుకు సహకరించేలా భాను కిరణాల్ని పోలిన కాంతిని ప్రసరింపజేస్తాయి. అది కూడా తొలుత ఎరుపు కాంతిని వెదజల్లి నెమ్మదిగా తెల్లనికాంతికి మారుతుందిది. ఈ వెలుగులు గదిలో పరచుకోవడంతో మనకు సులభంగా మెలకువ వస్తుంది. ఇందులో ఉండే లైటు రాత్రిపూట పుస్తకాలు చదువుకునే బెడ్‌ల్యాంప్‌గా కూడా ఉపయోగపడుతుంది.
లైటు నచ్చినట్టు…
ఇప్పటి దాకా లైటు కావాలంటే వేసుకుంటాం. వద్దూ అంటే తీసేస్తాం. కానీ స్మార్ట్ ల్యాంపులు ఇందుకు భిన్నం. పనిచేసుకునేప్పుడు ఒక కాంతి, పడుకోవాలనుకున్నప్పుడు మరో కాంతి.. ఇలా మన అవసరాలకు తగ్గట్లు వెలుతురును తగ్గించుకునేలా, పెంచుకోగలిగేలా వస్తున్నాయి. అంతేకాదు పండు వెన్నెల్లాంటి తెల్లటి వెలుతురు కావాలా, మబ్బు చాటు శశికాంతిలా గోధుమ వన్నె కావాలో కూడా ఎంచుకోవచ్చు. ఒక్క మాటచెప్తే చాలు లైటు అదే ఆగిపోతుంది, అదే వెలుగుతుంది కూడా. ఎరుపు, గులాబీ, నీలం.. ఇలా రంగుల్లోనూ ఇవి వెలుగుతాయి.
ఫ్రేమ్‌లో రోజుకో ఫొటో…
గోడకు తగిలించుకునే సీనరీలు, ఫొటో ఫ్రేములను ఒకసారి పెట్టామంటే ఇక రోజూ అదే చిత్రాన్ని చూస్తూ ఉండాల్సిందే. కానీ డిజిటల్ ఫ్రేమ్స్ టెక్నాలజీని అందిపుచ్చుకున్నాయి. మామూలు వాల్ ఫ్రేముల్లా కనిపించే వీటికి డిజిటల్ స్క్రీన్ ఉంటుంది. ఫోన్‌కు దీన్ని కనెక్ట్ చేసుకుని మనకు నచ్చిన ఫొటోను అందులోకి అప్లోడ్ చేయొచ్చు. అలా రోజుకొక చిత్రం అక్కడ కనిపించేలా పెట్టుకోవచ్చు. ఈ ఫొటో ఫ్రేములు కొన్నింటిలో స్టోరేజీ స్పేస్ కూడా ఉంటుంది. ఒక్క ఫొటోలే కాదు వీడియోలు కూడా కనిపించేలా సెట్ చేసుకోవచ్చు.
స్మార్ట్‌గా నీళ్లు పోయండి
అలవాటుగానో, అందం కోసమో మొక్కల్ని పెంచుతారు చాలామంది. సాధారణ కుండీల్లో వాటిని నాటితే రోజూ క్రమం తప్పకుండా నీళ్లు పోయాల్సిందే. అదే సెల్ఫ్ వాటరింగ్ స్మార్ట్ ప్లాంటర్లలో పెడితే మాత్రం ఇందులోని రిజర్వాయర్‌ను ఒకసారి నింపితే మొక్క అవసరాన్ని బట్టి అదే నీళ్లను అందిస్తూ ఉంటుంది. నీళ్లు అయిపోవచ్చినా, మొక్క ఆరోగ్యంగా లేకపోయినా ఫోన్‌కు అలర్ట్ పంపుతుంది. వెంటనే మనం మొక్క పరిస్థితిని గమనించుకోవచ్చు. ఎండలోకి మార్చడం, ఎరువులు అందించడంలాంటివి చేయొచ్చు.
Read More :
Naya mall | చార్జింగ్‌తో పనిచేసే ఈ బల్బు ద్వారా పాటలు కూడా వినవచ్చు”
“Naya mall | షుగర్ ఉన్నవాళ్లకు ఈ డివైజ్ ఎంత బెటర్ తెలుసా”
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
Dorothy | కార్తీక్ సుబ్బరాజ్ ‘డోరతి’ సినిమాపై రజినీకాంత్ ప్రశంసల జల్లు.. ‘నాకు కావలసిన కార్తీక్ ఇతనే’ అంటూ అభినందనలు!
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురు నేతల ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

