Deloitte | డెలాయిట్ కీలక నిర్ణయం : ఏఐ సాయంతో మాస్ లేఆఫ్స్‌కు చెక్
ఆర్ధిక మందగమనం, ఏఐ టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు వీధినపడుతుండగా, మాస్ లేఆఫ్స్‌కు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్ధితిని అధిగమించేందుకు దిగ్గజ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ (Deloitte) వినూత్న చర్యలతో ముందుకొచ్చింది.
న్యూఢిల్లీ : గత ఏడాదిన్నరగా జాబ్ మార్కెట్లో అనిశ్చితి నెలకొనడంతో ఎప్పుడేం జరుగుతుందోనని టెకీల్లో కలవరం నెలకొంది. మరోవైపు ఏఐ రాకతో ఎడాపెడా కొలువుల కోత తప్సదనే ఆందోళన పరిశ్రమను పట్టిపీడిస్తోంది. ఆర్ధిక మందగమనం, ఏఐ టెక్నాలజీతో వేలాది మంది ఉద్యోగులు వీధినపడుతుండగా, మాస్ లేఆఫ్స్‌కు అడ్డుకట్ట పడకపోవడం ఆందోళన రేకెత్తిస్తోంది. ఈ పరిస్ధితిని అధిగమించేందుకు దిగ్గజ కన్సల్టింగ్ కంపెనీ డెలాయిట్ (Deloitte) వినూత్న చర్యలతో ముందుకొచ్చింది.
మాస్ లేఆఫ్స్‌కు బ్రేక్ వేసేందుకు ఏఐ టెక్నాలజీ సాయం తీసుకోవాలని డెలాయిట్ యోచిస్తోంది. పెద్దసంఖ్యలో ఉద్యోగుల తొలగింపు ప్రణాళికల ట్రెండ్‌ను ఏఐ మార్చేస్తుందని ఈ దిశగా డెలాయిట్ కసరత్తు సాగిస్తోందని బ్లూంబర్గ్ నివేదిక పేర్కొంది. ప్రస్తుత ఉద్యోగుల నైపుణ్యాలను మదింపు వేస్తున్న కంపెనీ మారుతున్న పరిస్ధితుల్లో ఉద్యోగుల సేవలను చేసిన పనులే చేయడం వంటి టాస్క్‌ల నుంచి డిమాండింగ్ టాస్క్‌లకు మళ్లించేందుకు డెలాయిట్ ప్రయత్నిస్తోందని బ్లూంబర్గ్ రిపోర్ట్ వెల్లడించింది.
రాబోయే కాలంలో హైరింగ్ ప్రక్రియను పెంచే క్రమంలో ఉద్యోగుల నైపుణ్యాలను కంపెనీ మదింపు చేస్తోంది. ఈ మదింపులో భాగంగా ఈ ఏడాది 1,30,000 మందిని హైర్ చేసేందుకు కంపెనీ ప్రణాళికలు రూపొందిస్తోందని చెబుతున్నారు. మాస్ హైరింగ్ ప్రయత్నాలు ఊపందుకున్నా డిమాండ్ మందకొడిగా ఉన్నందున నిర్ధిష్ట విభాగాలు, వ్యాపారంలో పునర్వ్యవస్ధకరణ చేపట్టే క్రమంలో అమెరికా, బ్రిటన్‌లో కొందరి ఉద్యోగాలు కనుమరుగయ్యే అవకాశాలున్నాయని కంపెనీ హెచ్చరించింది. భారీ హైరింగ్స్, లేఆఫ్స్ నివారించగలగడం గొప్ప లక్ష్యమని, సరైన వ్యక్తుల ఎంపికలో ఎప్పుడూ సమర్ధవంతంగా ఉండాలని డెలాయిట్ గ్లోబల్ చీఫ్ టాలెంట్ ఆఫీసర్ స్టీవెన్ రోల్స్ చెప్పుకొచ్చారు.
Read More :
OnePlus-IIT Madras | ఐఐటీ బీటెక్ విద్యార్థుల కోసం వన్ ప్లస్ స్కాలర్షిప్.. మద్రాస్ ఐఐటీతో పార్టనర్షిప్..!
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

