OnePlus-IIT Madras | ఐఐటీ బీటెక్ విద్యార్థుల కోసం వన్ ప్లస్ స్కాలర్షిప్.. మద్రాస్ ఐఐటీతో పార్టనర్షిప్..!
OnePlus-IIT Madras | ఐఐటీ మద్రాస్ తో కలిసి నెవర్ సెటిల్ అనే పేరుతో బీటెక్ విద్యార్థుల కోసం స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల సంస్థ వన్ ప్లస్ తెలిపింది.
OnePlus-IIT Madras | గ్లోబల్ ప్రీమియం స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్ (OnePlus) అర్హులైన విద్యార్థులకు స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ప్రకటించింది. ఇందుకోసం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మద్రాస్ (ఐఐటీ-మద్రాస్)తో కలిసి నెవర్ సెటిల్ (Never Settle) అనే స్కాలర్ షిప్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. భారత్లో స్మార్ట్ ఫోన్ల విక్రయం ప్రారంభమై 10 ఏండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ ‘స్కాలర్షిప్’ ఇన్షియేటివ్ తీసుకొచ్చినట్లు తెలిపింది. ఐఐటీ మద్రాస్ బీటెక్ కోర్సులో కొత్తగా చేరిన విద్యార్థులు, పాత విద్యార్థులకు ఈ స్కాలర్ షిప్ అందచేస్తామని పేర్కొంది.
మెరిట్ కం అర్హత ఆధారంగా స్కాలర్ షిప్ మంజూరు చేసేందుకు అర్హులైన విద్యార్థులను ఎంపిక చేస్తామని వన్ప్లస్ వెల్లడించింది. అర్హులైన విద్యార్థుల ఉన్నత విద్యాభ్యాసానికి ఆర్థికంగా అవరోధాలను నిరోధించడమే లక్ష్యంగా గణనీయ స్కాలర్ షిప్ అందజేయడానికే ‘నెవర్ సెటిల్ (Never Settle)’ అనే స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ తెచ్చినట్లు తెలిపింది. అయితే, స్కాలర్ షిప్ పూర్తి వివరాలు వెల్లడించలేదు.
పదేండ్ల క్రితం భారత్లో వన్ ప్లస్ ఫోన్ల విక్రయాలు ప్రారంభించామని, భారతీయ సమాజానికి ఏదైనా చేయాలన్న సంకల్పంతోనే ఈ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ ప్రారంభించినట్లు సంస్థ ఫౌండర్ పీట్ లా చెప్పారు. కొత్త ఫోన్ల రూపకల్పనలో ఐఐటీ మద్రాస్ సహకారం ఎంతో ప్రాముఖ్యం కలిగి ఉందన్నారు. భారతీయ యువతకు మెరుగైన విద్యావకాశాలు కల్పించేందుకు తాము చేస్తున్న ప్రయత్నాల్లో జత కలిసినందుకు వన్ ప్లస్ లీడర్ షిప్ టీంకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు ఐఐటీ-మద్రాస్ డీన్ ప్రొఫెసర్ మహేశ్ పంచగ్నుల చెప్పారు. సైన్స్ అండ్ టెక్నాలజీ రంగంలో భవిష్యత్ ఆవిష్కరణలకు వన్ ప్లస్ నెవర్ సెటిల్ స్కాలర్ షిప్ ప్రోగ్రామ్ సాధికారత కల్పిస్తుందన్నారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma Celebrations | ఎతుబార్పల్లిలో అంబరాన్నంటిన బతుకమ్మ సంబరాలు..
KTR | స్వదేశీ మొబిలిటీ ప్లాట్ఫామ్ ‘రుటూర్’ ప్రారంభం.. డ్రైవర్లకు కమీషన్ లేని సేవలే లక్ష్యం!
JCJ Results | మూడు రోజుల వ్యవధిలోనే రెండు కొలువులు.. జూనియర్ సివిల్ జడ్జిగా పెద్దపల్లి యువతి హారిక..!
హస్తినలో పరిమళించిన తెలంగాణ పూల పండుగ.. తెలంగాణ భవన్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
Destiny | నందినీ రెడ్డి చేతుల మీదుగా ‘డెస్టినీ’ ఫస్ట్ లుక్ లాంచ్.. ఇంట్రెస్టింగ్గా ఇమ్మాన్యుయేల్ లుక్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

