iPhone | న్యూఢిల్లీ, జూలై 16: సైబర్ మోసాలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో మోసగాళ్ల వలకు చిక్కకుండా ఉండేందుకు ఐఫోన్ వినియోగదారులకు యాపిల్ సంస్థ పలు సూచనలు చేసింది. ఈ మేరకు కంపెనీ సెక్యూరిటీ డాక్యుమెంట్‌ను అప్డేట్ చేసింది. యాపిల్ సూచించిన జాగ్రత్తలు ఇవీ..
1. మోసపూరిత ఈమెయిళ్లను గుర్తించేందుకు గానూ ఈమెయిల్‌కు స్పందించే ముందు అది ఏ మెయిల్ ఐడీ నుంచి వచ్చిందనేది ధ్రువీకరించుకోవాలి.
2. ‘మీ ఫోన్లో సెక్యూరిటీ సమ స్య ఉంది’ అంటూ వచ్చే పాప్అప్ యాడ్లను క్లిక్ చేయవద్దు. ఇవి చాలా వరకు మోసపూరితమైనవి అయ్యే అవకాశం ఉంది.
3. ‘యాపిల్ సపోర్ట్’ పేరుతో మోసగాళ్లు ఫోన్లు, మెసేజ్‌లు చేయవచ్చు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండాలి.
4. ఉచితంగా లేదా ఏదైనా బహుమతి వచ్చిందని వచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు.
5. గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వచ్చే ‘క్యాలెండర్ ఇన్వైట్’లను తిరస్కరించాలి.
6. పాస్వర్డ్లు, సెక్యూరిటీ కోడ్లను తెలియని వెబ్సైట్లలో ఎంటర్ చేయొద్దు.
7. యాపిల్ ఐడీకి టూ ఫాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోవాలి. కాంటాక్ట్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలి.
8. సాఫ్ట్‌వేర్‌ను కేవలం నమ్మకమైన మార్గాల్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి.