Cows toilet : మనుషుల మాదిరిగా టాయిలెట్ వాడుతున్న ఆవులు
Cows toilet : నుషుల మాదిరిగా జంతువులు కూడా యూరినేట్ కోసం టాయిలెట్ వినియోగించడం.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మూత్ర విసర్జన కోసం అక్కడి ఆవులు టాయిలెట్‌ను వాడుతున్నాయి...

బెర్లిన్ : మనుషుల మాదిరిగా జంతువులు కూడా యూరినేట్ కోసం టాయిలెట్ వినియోగించడం.. వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. మూత్ర విసర్జన కోసం అక్కడి ఆవులు టాయిలెట్‌ను వాడుతున్నాయి. ఎక్కడపడితే అక్కడ మూత్ర విసర్జన కారణంగా కాలుష్యం పెరిగిపోతున్నందున.. దాన్ని నివారించేందుకు ఆవులకు (Cows toilet) జర్మనీ శాస్త్రవేత్తలు శిక్షణ ఇచ్చారు. వారు ఏర్పాటు చేసిన మూత్రశాలలోకే వెళ్లి మూత్రవిసర్జన చేస్తున్నాయి. ఇది వాతావరణానికి ఎంతో ప్రయోజకరమని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ అధ్యయనాన్ని జర్మనీలోని ఫార్మ్ ఎనిమల్ బయాలజీ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ చేపట్టింది.
గ్రీన్‌హౌజ్ గ్యాస్ కరెంట్ బయాలజీలో ప్రచురించిన పరిశోధన ప్రకారం, బహిరంగ ప్రదేశాల్లో జంతువుల విసర్జనను నిరోధించడం వలన అమ్మోనియాను పెరుగకుండా నిరోధించవచ్చు. అమ్మోనియా నేల సారవంతంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. సూక్ష్మజీవుల సహాయంతో అమ్మోనియాను నైట్రస్ ఆక్సైడ్‌గా మార్చవచ్చు. కార్బన్ డయాక్సైడ్, మీథేన్ తర్వాత ఇది మూడవ అతి ముఖ్యమైన గ్రీన్‌హౌజ్ వాయువు. గ్రీన్ హౌజ్ వాయువులు ప్రధానంగా వాతావరణంలోని ఉష్ణోగ్రత పెరుగడానికి కారణమవుతుంటాయి. అమ్మోనియాను నిరోధించేందుకు ఆవుల కోసం ప్రత్యేక టాయిలెట్‌ను రూపొందించారు. ఆవు వ్యర్థాల నుంచి అమ్మోనియాను సేకరించి నేరుగా పర్యావరణంలోకి వ్యాపించకుండా నిరోధించవచ్చంటున్నారు పరిశోధకులు.
పశువుల్లో ముఖ్యంగా ఆవు మన నుంచి త్వరగా నేర్చుకునే గుణాలను కలిగి ఉంటున్నందున తొలుత వాటి కోసం మూత్రశాల శిక్షణ అందించినట్లు పరిశోధకుడు జేన్ లాంగ్బీన్ వెల్లడించారు. తమ శిక్షణ కారణంగా బయట మూత్రవిసర్జన చేయకుండా ఆవులు నేర్చుకోగలిగాయని, కొన్ని వారాల శిక్షణ అనంతరం 16 ఆవుల్లో 11 ప్రత్యేకంగా తయారుచేసిన ‘మూలు’ టాయిలెట్‌ను వినియోగించుకోగలిగాయని ఆయన తెలిపారు.
ఇవి కూడా చదవండి..
సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Shreyas Iyer: తుది జట్టులో వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కడం కష్టమే: శ్రేయాస్ అయ్యర్
Okra | బెండకాయ జిగురు మంచిదేనా? జీర్ణక్రియ, కొలెస్ట్రాల్‌పై కీలక విషయాలు!
Thallapeta clashes | ఘర్షణలతో పోలీసుల పహారాలో తాళ్లపేట.. మంచిర్యాలలో ఉత్కంఠ.. వీడియో
Iran vs US | ఒక్క గ్రాము యురేనియం కూడా మా దేశం నుంచి బయటికి వెళ్లదు : ఇరాన్
The Prompt War | మైథాలజీ, ఫ్యూచరిస్టిక్ టెక్నాలజీతో ‘ది ప్రాంప్ట్ వార్’.. టైటిల్ పోస్టర్ రిలీజ్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

