Photocopying : ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
Photocopying : ఒక డాక్యుమెంట్‌ను ఉన్నది ఉన్నట్లుగా కావాలంటే ప్రింట్ తీసుకోవడం లేదా ఫొటో కాపీయింగ్ చేసుకోవడం వల్ల సాధ్యం. అలా ఫొటో కాపీయింగ్ చేయడానికి వీలుగా మొదటిసారి యంత్రాన్ని...

ఒక డాక్యుమెంట్‌ను ఉన్నది ఉన్నట్లుగా కావాలంటే ప్రింట్ తీసుకోవడం లేదా ఫొటో కాపీయింగ్ (Photocopying) చేసుకోవడం వల్ల సాధ్యం. అలా ఫొటో కాపీయింగ్ చేయడానికి వీలుగా మొదటిసారి యంత్రాన్ని సరిగ్గా 1959 లో తీసుకొచ్చారు. ప్రపంచంలోనే తొలి ఆటోమేటిక్ ఫొటోకాపీయింగ్ మెషిన్‌ను జీరాక్స్ అనే కంపెనీ తీసుకొచ్చింది. తొలుత ఈ మెషిన్ 294 కిలోల బరువుండి.. నిమిషానికి కేవలం 7 పేజీలను మాత్రమే ఫొటో కాపీయింగ్ చేసేది. అయితే, పలు పరిశోధనల అనంతరం ఎన్నో కొత్త మోడళ్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి.
అమెరికాలోని టీవీ ఛానళ్లలో 1959 లో వచ్చిన ఒక అడ్వర్టైజ్మెంట్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నది. ‘ఒక మెషిన్ ముందు కూర్చున్న ఒక కోతి.. సింపుల్‌గా ఒక బటన్ నొక్కగా ఒక డాక్యుమెంట్ ఫొటోకాపీ బయటకు వచ్చింది. చూశారా ఎంత సులభంగా ఉందో.. ఫొటో కాపీయింగ్ చేయడం.. కోతి సైతం ఫొటో కాపీ తీయవచ్చు’ అని ఆ ప్రకటన సారాంశం. ఈ ప్రకటన ద్వారా జీరాక్స్ కార్పొరేషన్ తన ఫొటోకాపీయింగ్ మెషిన్ జీరాక్స్-914 ను ప్రజలకు పరిచయం చేసింది. ఈ యంత్రం రెండేండ్ల పాటు పనిచేసింది. దీనిని అభివృద్ధి చేయాలని భావించి పరిశోధనలు చేపట్టారు. నిమిషంలో 17 కాపీలను జీరాక్స్ చేసే నాలుగు మోడళ్లను తీసుకువచ్చింది. అనంతరకాలంలో ఎన్నో కంపెనీలకు చెందిన రకరకాల జీరాక్స్ యంత్రాలు మార్కెట్లోకి వచ్చాయి.
మరికొన్ని ముఖ్య సంఘటనలు..
నేడు ఓజోన్ పొర పరిరక్షక అంతర్జాతీయ దినం
2007 : థాయిలాండ్‌లో విమానం కుప్పకూలి 89 మంది దుర్మరణం
1986 : దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో చిక్కుకుని వందలాది మంది మృతి
1982 : లెబనాన్ బీరట్‌లో ఉన్న శరణార్థి శిబిరంలో 3000 మంది ఊచకోత
1978 : పాకిస్తాన్ అధ్యక్షుడిగా జనరల్ జియా ఉల్ హక్ ఎన్నిక
1975 : ఆస్ట్రేలియా నుంచి స్వాతంత్య్రం ప్రకటించుకున్న పపువా న్యూగినియా
1932 : మలేరియా దోమను కనిపెట్టిన రోనాల్డ్ రోస్ జనం
1920 : న్యూయార్క్‌లోని వాల్‌స్ట్రీట్‌లో బాంబు పేలిన ఘటనలో 38 మంది దుర్మరణం
1916 : ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జననం
1908 : జనరల్ మోటార్స్ కార్పొరేషన్ ప్రారంభం
ఇవి కూడా చదవండి..
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
సర్జికల్ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
Pattiseema | 100 రోజులు ఏపీలో ఆగకుండా ఎత్తిపోత.. పట్టిసీమతో 65 టీఎంసీల గోదావరి జలాలు తరలింపు!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

