Al Qaeda : అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
Al Qaeda : ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని అంతచేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ.. అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడి చేసే అవకాశాలు ...

వాషింగ్టన్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తీవ్రవాదాన్ని అంతచేయాలన్న మా లక్ష్యం నెరవేరిందని అమెరికా ప్రకటించినప్పటికీ.. అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా (Al Qaeda) దాడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఆఫ్ఘనిస్తాన్‌ను తాలిబాన్ తమ ఆధీనంలోకి తెచ్చుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో రానున్న కాలంలో అక్కడ అల్ ఖాయిదా తిరిగి వేళ్లూనుకుంటుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రానున్న 1,2 సంవత్సరాల్లో అమెరికాపై అల్ ఖాయిదా మరోసారి దాడికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్ డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డైరెక్టర్ లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్‌ను ఉటంకిస్తూ నివేదికలో పేర్కొన్నారు. మంగళవారం జరిగిన ఇంటెలిజెన్స్ కాన్ఫరెన్స్‌లో లెఫ్టినెంట్ జనరల్ స్కాట్ బెరియర్ ప్రసంగించారు. తిరిగి జీవం పోసుకుని అభివృద్ధి చెందేందుకు కావాల్సిన అన్ని రకాల వనరులు, అవకాశాల కోసం ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖాయిదా మార్గాలను అన్వేషిస్తున్నదని చెప్పారు.
కాగా, ఒకటి, రెండేండ్ల కాలవ్యవధిని సీఐఏ డిప్యూటీ డైరెక్టర్ డేవిడ్ కోహెన్ అంగీకరించారు. ఆఫ్ఘనిస్తాన్‌లో అల్ ఖాయిదా తిరిగి వస్తున్న విషయాలను నిఘా సంస్థలు ఇప్పటికే గమనించాయని చెప్పారు. అయితే, రెండు దశాబ్దాల అమెరికన్ దళాల ఉపసంహరణ అనంతరం ఆఫ్ఘనిస్తాన్ ముప్పు జాబితాలో ఉన్నదని ఎన్ఐఏ డైరెక్టర్ అవ్రిల్ హైన్స్ పేర్కొన్నారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అనేక విమర్శలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి..
మళ్లీ హైదరాబాద్‌కు ఆడనున్న విహారి
రుణం లేకుండా ఏపీ మనుగడ సాగించదు: జీవీఎల్
సర్జికల్ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్‌షో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rice Scam | రూ.15 బియ్యం.. రూ.100కు అమ్మకం.. రేషన్ బియ్యం రీసైక్లింగ్ దందా బట్టబయలు!
Anupama Parameswaran | ఎయిర్‌పోర్టులో అనుపమ పరమేశ్వరన్‌కు చేదు అనుభవం.. ఫొటోల పేరుతో అలా చేశారంటూ ఆవేదన!
Number Plates | BOSS, IGOD, 1, 3, 9.. నంబర్ ప్లేట్లపై కొత్త ట్రెండ్.. ఆర్టీఏ అధికారుల కొరడా!
Aadarsha Kutumbam | వెంకటేష్ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ వచ్చేసింది.. త్రివిక్రమ్ మార్క్ డైలాగ్స్‌తో అదరగొట్టిన విక్టరీ స్టార్!
Hyderabad | రాజేంద్రనగర్‌లో మారణాయుధాల కలకలం.. రూ.4లక్షల విలువ చేసే గంజాయి, పిస్టోళ్లు స్వాధీనం
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

