e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, September 26, 2021
Home అంతర్జాతీయం Doordarshan : మన దూరదర్శన్‌కు 62 ఏండ్లు

Doordarshan : మన దూరదర్శన్‌కు 62 ఏండ్లు

ఇప్పుడు టీవీ స్టార్ట్‌ చేసి రిమోట్‌ నొక్కగానే వందలాది ఛానళ్లు మన కండ్ల ముందు మెరుస్తున్నాయి. పాటలు, సినిమాలు, వార్తలు, ఆధ్యాత్మికం.. ఇలా ఎన్నో ప్రత్యేక ఛానళ్లు మనకు అందుబాటులోకి వచ్చాయి. అయితే, కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే ఒక ఛానల్‌ మాత్రమే కార్యక్రమాలు అందించేంది. అదే దూరదర్శన్‌ (Doordarshan). సరిగ్గా నేటికి 62 ఏండ్ల క్రితం అంటే 1959 లో ఇదే రోజున దూరదర్శన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అప్పట్లో ఇప్పటిమాదిరిగా కాకుండా కేవలం వారంలో మూడు రోజులే కార్యక్రమాలు ప్రసారం అయ్యేయి. అది కూడా కేవలం అర్ద గంట సమయం పాటే కార్యక్రమాలు వీక్షించే అవకాశం ఉండేది.

తొలుత మన దేశంలో దూరదర్శన్‌ను టెలివిజన్‌ ఇండియా అనే పేరుతో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. ఆ సమయంలో పాఠశాల విద్యార్థుల కోసం విద్యా సంబంధ విషయాలను మాత్రమే ప్రసారమయ్యేవి. 1965 నుంచి నిత్యం ప్రసారాలు జరుపడం ప్రారంభించారు. 1975 లో 6 రాష్ట్రాల్లో శాటిలైట్‌ ఇన్‌స్ట్రక్షనల్‌ టెలివిజన్‌ ఎక్స్‌పరిమెంట్‌ (ఎస్‌ఐటీఈ) ప్రారంభమై.. కమ్యూనిటీ టెలివిజన్‌గా కార్యక్రమాలను ప్రసారం చేశారు. మరుసటి ఏడాది ఆలిండియా రేడియో నుంచి విడివడి స్వతంత్ర సంస్థగా కొనసాగింది. 1982 లో ఇన్‌శాట్‌-1 ద్వారా జాతీయ ప్రసారాలను అందించడం ద్వారా ప్రజలకు చేరువవడం మొదలైంది. ఢిల్లీలో జరిగిన ఆసియా క్రీడలతో టెలివిజన్‌కు విశేష ప్రాచుర్యం లభించింది. ప్రస్తుతం దూరదర్శన్‌కు అనుబంధంగా 34 ఛానళ్లు నడుస్తున్నాయి. దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాల రాజధానుల్లో, 49 మిగతా ప్రాంతాలతో కలిపి మొత్తం 66 స్టూడియోలను కలిగి ఉన్నది. ఈ నేపథ్యంలో లోక్‌సభ, రాజ్యసభ ఛానళ్లను ఒకటిగా చేసి నెలకొల్పిన ‘సన్సద్‌ టీవీ’ ని ఇవాళ ప్రారంభించడం విశేషం.

మరికొన్ని ముఖ్య సంఘటనలు..

- Advertisement -

ఇవాళ జాతీయ ఇంజనీర్ల దినోత్సవం

2004 : బ్రిటన్‌కు చెందిన గురీందర్‌ చద్దాకు ‘ఉమెన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డు ప్రదానం

2002 : న్యూయార్క్‌లోని యూఎన్‌ఓలో భారతదేశం, చైనా, రష్యా విదేశాంగ మంత్రుల సమావేశం

1982 : లెబనాన్‌ అధ్యక్షుడిగా ఎన్నికై అధికారం చేపట్టకముందే బాంబుదాడిలో హత్యకు గురైన బషీర్‌ గెమాయెల్‌

1981 : ఐక్యరాజ్య సమితిలో సభ్యత్వం పొందిన వనాటు

1971 : గ్రీన్‌ పీస్‌ సంస్థ ప్రారంభం

1948 : ముంబై తీరానికి చేరుకున్న ఐఎన్‌ఎస్‌ ఢిల్లీ

1894 : చైనా-జపాన్‌ మధ్య తొలి యుద్ధం ప్రారంభం

1861 : డాక్టర్‌ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జన్మదినం

ఇవి కూడా చ‌ద‌వండి..

గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట

నీరజ్‌ జావెలిన్‌ కోచ్‌ ఉవే హూన్‌ తొలగింపు

బీఏలో ఆప్షనల్‌ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్‌’.. ఎక్కడంటే?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana