ఉద్యోగం రాలేదని యువకుడి ఆత్మహత్య
ఉన్నత చదువులు చదివి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
- రెండేండ్ల కిందటే బీటెక్ పూర్తి
- పెద్దపల్లి జిల్లా పెగడపల్లిలో విషాదం
కాల్వశ్రీరాంపూర్, మే 31: ఉన్నత చదువులు చదివి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం రాలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం పెగడపల్లిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెగడపల్లి గ్రామ సర్పంచ్ ఆరెల్లి రమేశ్‌కు ఇద్దరు కొడుకులు. ఇందులో పెద్ద కుమారుడు సాయిరామ్ (24) రెండేండ్ల క్రితం బీటెక్ పూర్తి చేశాడు. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నాడు. కొలువు రాకపోవడం, మున్ముందు వస్తుందా? లేదా? తెలియక మనస్తాపానికి లోనయ్యాడు. రెండు రోజుల క్రితం ఇంటివద్ద పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స కోసం కరీంనగర్‌లోని దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమించి ఆదివారం మృతి చెందాడు. తండ్రి రమేశ్ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై వెంకటేశ్ తెలిపారు. ప్రభుత్వ విప్ విజయరమణారావు.. సాయిరామ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
TCS: గ్రీన్ కార్డు చర్యలు ప్రభావం చూపవు.. 15వేల మందిని రిక్రూట్ చేసుకుంటాం: టీసీఎస్
Nana Patekar | నానా పటేకర్ అంత్యక్రియలు అర్ధరాత్రి ఎందుకు నిర్వహించారంటే.. కుమారుడు వివరణ!
KU exams | రేపటి కేయూ పరీక్షలు వాయిదా
Shruti Haasan | బ్లాక్ లుక్‌లో శ్రుతిహాసన్.. గ్లామర్‌తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తున్న బ్యూటీ!
AINRC: పుదుచ్చరి ఉప ఎన్నికలో ఏఐఎన్ఆర్సీ పార్టీ విజయం
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

