పోచంపల్లి కీర్తిని ప్రపంచానికి చాటుతాం
పోచంపల్లి ఇకత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో టూరిస్టు అండ్ క్రియేటివ్ ఎకానమీ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో 40 మంది ప్రతినిధుల బృందం భూదాన్ పోచంపల్లిని సందర్శించింది.
- మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకత్ చేనేత బ్రాండ్ అంబాసిడర్ రష్మీ ఠాకూర్
భూదాన్ పోచంపల్లి, ఆగస్టు 8 : పోచంపల్లి ఇకత్ వస్త్రాల కీర్తిని ప్రపంచ దృష్టికి తీసుకెళ్లేందుకు నిరంతరం కృషి చేస్తానని మిస్ ఆసియా ఇంటర్నేషనల్, తెలంగాణ ఇకత్ చేనేత అంబాసిడర్ రష్మీ ఠాకూర్ అన్నారు. శనివారం భూదాన్ పోచంపల్లిలో టూరిస్టు అండ్ క్రియేటివ్ ఎకానమీ డెవలప్మెంట్ కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో 40 మంది ప్రతినిధుల బృందం భూదాన్ పోచంపల్లిని సందర్శించింది. టూరిజం పారు, భూదానోద్యమం, చేనేత కార్మికుల గృహాలు, చేనేత మగ్గాలు, వస్త్రాల తయారీ, రాట్నం వడకడం, చిటికీ కట్టడం, రంగులు అద్దడం, తదితర ప్రక్రియలను వారు పరిశీలించారు.
గ్రామీణ వాతావరణం, పల్లె సంసృతి, చేతి వృత్తులపై అధ్యయనం చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాలతో పోచంపల్లి టూరిజం అభివృద్ధికి కన్సల్టెన్సీ ఆధ్వర్యంలో ప్రణాళిక రూపొందించారు. ప్రజల అభిరుచులకు అనుగుణంగా టూరిజం ప్రాంత అభివృద్ధి కోసం కన్సల్టెన్సీ ప్రతినిధులు సాహితీ, శ్రీనివాస్ అధ్యయనం చేశారు. కార్యక్రమానికి హాజరైన రష్మీ ఠాకూర్‌ను నూలు దారం, చేనేత వస్త్రాలతో మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, రాష్ట్ర చేనేత నాయకులు తడక రమేష్ సతరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సెప్టెంబర్ 25న బ్రిటన్ పార్లమెంట్లో పోచంపల్లి చేనేతపై 15 నిమిషాలు ప్రసంగించే అవకాశం దొరికిందని, బ్రిటన్‌కు తెలంగాణ నుంచి ఒకరిని ఎంపిక చేశారని తెలిపారు. పోచంపల్లి అంటే అందరూ శారీస్ మా త్రమే అనుకుంటారని, అది ఓల్డ్ ట్రెడిషన్ అని, ప్రస్తుత న్యూ ట్రెండ్‌కు తగ్గట్టుగా కోట్లు, బ్లేజర్లు, ట్రోజర్, ఫర్నిచింగ్ , టేబుల్ క్లాత్, సోఫా కవర్స్, కర్టెన్స్ ఇంటీరియర్ డెకరేషన్ ఎలా వాడుకోవాలో తెలియజేస్తారని అన్నారు.
విదేశీయులు వేసుకునే వస్త్రాలకు అనుగుణం గా పోచంపల్లి చేనేత వస్త్రాలను రూపొందించాలని, విదేశీ సూళ్లలో పిల్లల యూనిఫామ్ కోసం పోచంపల్లి వస్త్రాలను ప్రమోట్ చేయాలని అన్నారు. అందుకు కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు సహకారం అందించాలన్నారు. చీరలు గురించి చెప్పడమే కాదు.. ఖాదీ వస్త్రాలకు పోచంపల్లి చేనేత వస్త్రాలకు తేడా చెప్పాలని అన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ ఏడీ శ్రీనివాసరావు, మున్సిపల్ చైర్మన్ తడక వెంకటేశ్వర్లు, పోచంపల్లి ప్రొడ్యూసర్ కంపెనీ సీఈవో తడక రమేష్, పోచంపల్లి చేనేత సహకార సంఘ అధ్యక్షుడు భారత లవకుమార్, టై అండ్ డై అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి బాలరాజు, పద్మశాలీ చేనేత కార్మిక సంఘం అధ్యక్షుడు అంకం పాండు, వెంకటరమణ సిల్ సంఘం అధ్యక్షుడు చింతకింది రమేష్, అసోసియేషన్ ప్రతినిధులు ఈ పూరి ముత్యాలు, కుడిక్యాల రామనరసింహ, ముసూరి నరసింహ, బోడ దయానంద్, నవనీత, గుండు రాజేశ్వరి పాల్గొన్నారు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranabaali | రణబాలి ట్విట్టర్ రివ్యూ.. విజయ్ దేవరకొండ నటనకు ప్రశంసలు, కథనంపై మిశ్రమ స్పందన!
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలిని, రోహిత్ మధ్య బ్రేకప్ వార్.. టాస్క్‌లో ఓటమితో వంశీ కన్నీళ్లు!
Caller ID | కాలర్ పేరు ప్రదర్శించడం తప్పనిసరి.. టెలికం కంపెనీలకు కేంద్రం ఆదేశం
Paper Leak | 8 ఏండ్లుగా పేపర్ లీక్‌లే లేవట.. NTAపై కేంద్ర విద్యా శాఖ నివేదిక
Reservations | మతం మారితే రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

