Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
Kamala Harris : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను చంపేందుకు కుట్రపన్నినట్లు ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఒప్పుకున్నది. నేరాన్ని అంగీకరించడంతో ఆ మయామి నర్స్‌కు ఫెడరల్ కోర్టు...

వాషింగ్టన్ : అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ను (Kamala Harris) చంపేందుకు కుట్రపన్నినట్లు ఫ్లోరిడాకు చెందిన ఓ మహిళ ఒప్పుకున్నది. నేరాన్ని అంగీకరించడంతో ఆ మయామి నర్స్‌కు ఫెడరల్ కోర్టు ఐదేండ్ల జైలుశిక్ష విధించింది. 39 ఏళ్ల నివియాన్ పెటిట్ ఫెల్ప్స్ శుక్రవారం వైస్ ప్రెసిడెంట్ బెదిరింపుల నేరారోపణలను అంగీకరించారు. కమలా హారిస్‌ను హత్య చేస్తానని ఆరుసార్లు బెదిరింపులకు పాల్పడినట్లు తానే స్వయంగా కోర్టుకు వెల్లడించింది. ఫ్లోరిడాలోని జిల్లా కోర్టులో పిటిషన్ విచారణ సందర్భంగా ఫెల్ప్స్ తనపై ఆరోపించిన నేరాలన్నింటినీ ఒప్పుకున్నారు. కమలా హారిస్ నల్ల జాతికి చెందిన వ్యక్తి కాకపోవడం వల్లనే ఆమెను చంపేందుకు బెదిరించినట్లు ఫెల్ప్స్ విచారణ అధికారుల ఎదుట చెప్పినట్లు తెలుస్తున్నది.
కమలా హారిస్‌ను చంపుతానంటూ తనంత తానుగా తీసుకున్న 30 సెకండ్ల నిడివి గల వీడియో క్లిప్పులను జైలులో ఉన్న తన భర్తకు పంపినట్లు న్యాయస్థానం గుర్తించింది. కమలపై దాడి చేయాలన్న ఆలోచన మేరకు కొందరు వ్యక్తులతో బేరం కుదుర్చుకున్నానని, 50 రోజుల్లోనే ఆమెను చంపేస్తారని ఆ వీడియో క్లిప్పుల్లో రికార్డయి ఉన్నది. హారిస్‌ను చంపేందుకు 53 వేల డాలర్లకు కొందరితో ఒప్పందం చేసుకున్నట్లు చెప్తున్న వాయిస్ కూడా వినిపిస్తున్నది. ఈ వీడియో క్లిప్పుల్లో కొన్నింటిని తనకు తాను రికార్డ్ చేయగా.. మరికొన్నింటిని ఆమె పిల్లలు రికార్డ్ చేసినట్లుగా తెలుస్తున్నది. ఈ వీడియోలను పంపిన తర్వాత, తుపాకీ రేంజ్లో టార్గెట్ షీట్ వద్ద తుపాకీ పట్టుకున్న ఫొటోను కూడా పంపింది. దాచిపెట్టిన ఆయుధానికి అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు కూడా ప్రాసిక్యూటర్లు కోర్టుకు విన్నవించారు.
ఇవి కూడా చదవండి..
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్‌షో
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్‌గా ‘రామ్‌చరిత్‌మానస్’.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | ఇంట్లో నాఫ్తలీన్ బాల్స్ వాడుతున్నారా..? అయితే ఈ ప్రమాదాల గురించి తెలుసుకోవాల్సిందే..!
Amitabh Bachchan | మరోసారి వైరల్ అవుతున్న అమితాబ్ బచ్చన్ డైట్.. ఇంతకీ ఆయన ఏం తీసుకుంటారు..?
judge’s Minor son drives Car hits scooter | లగ్జరీ కారు నడిపిన జడ్జి మైనర్ కుమారుడు.. స్కూటీని ఢీకొట్టడంతో వ్యక్తి మృతి
X Money | ఇక ఎక్స్ ద్వారా కూడా డబ్బులు పంపొచ్చు.. కొత్త ఫీచర్ ప్రకటించిన ఎలాన్ మస్క్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’లో నయనతార.. ఆరోసారి జోడీ కడుతున్న సూపర్‌స్టార్, లేడీ సూపర్‌స్టార్!
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

