Amitabh Bachchan : డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
Amitabh Bachchan : ఒక వ్యక్తి కోసం.. అదే సమయంలో తన కోరికను తీర్చుకునేందుకు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ .. డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు...

ముంబై : ఒక వ్యక్తి కోసం.. అదే సమయంలో తన కోరికను తీర్చుకునేందుకు ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) .. డెలివరీ బాయ్‌గా అవతారమెత్తారు. ఎందరికో పార్శిల్స్ అందించే ఉద్యోగం చేస్తున్న తనకు, ఎవరైనా పార్శిల్అందిస్తే అందుకోవాలన్న కోరిక ఉండి అణుచుకుంటున్న ఆ యువకుడికి పార్శిల్ అందించారు బిగ్ బీ. దాంతో అక్కడున్న వాళ్లంతా ఆనందభాష్పాలు రాల్చారు. ఈ సంఘటన అమితాబ్ బచ్చన్ ప్రయోక్తగా సోనీ టీవీలో ప్రసారమవుతున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ఎపిసోడ్లో జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమోను సోనీ టీవీ విడుదల చేసింది.
అమితాబ్ బచ్చన్‌కు ఎదురుగా ఉన్న హాట్ సీట్లో పుణెకు చెందిన ఆకాశ్ వాగ్మారే కూర్చుని ఉన్నారు. ఆకాశ్ ఒక సంస్థలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. నిర్మాణంలో ఉన్న ఒక ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్న ఆకాశ్‌కు ఉన్నత విద్యాభ్యాసం చేయాలనే బలమైన కోరిక ఉన్నది. అయితే, పరిస్థితులు అనుకూలించకపోవడంతో డెలివరీ బాయ్‌గా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు. కేబీసీ వేదికపైకి వచ్చే అవకాశం రావడంతో ఆకాశ్.. తన కలల్ని సాకారం చేసుకునే మంచి తరుణం వచ్చిందని సంబురపడ్డాడు. తన కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడ్డారని, వారిని మంచిగా చూసుకోవాల్సిన బాధ్యత తనపై ఉన్నదని ఆకాశ్ చెప్పాడు.
ఇలాఉండగా ఆకాశ్ కోరిక తెలుసుకున్న బిగ్ బీ ఆయన కోసం డెలివరీ బాయ్‌గా అవతారం ఎత్తారు. ఆయనకు ఒక పార్శిల్‌ను అందించారు. దాంతో అక్కడ ఒక్కసారిగా ఉద్విఘ్న వాతావరణం నెలకొన్నది. అక్కడ ఉన్న వారంతా ఆనందభాష్పాలు రాల్చారు. ఇదే సమయంలో డెలివరీ బాయ్‌గా పనిచేయాలన్న తన కోరికను కూడా తీర్చుకున్నట్లు అమితాబ్ బచ్చన్ చెప్పారు. ఈ ఎపిసోడ్ ఇవాళ రాత్రి 9 గంటలకు సోనీ టీవీలో ప్రసారం కానున్నది.
ఇవి కూడా చదవండి..
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
మళ్లీ హైదరాబాద్‌కు ఆడనున్న విహారి
రుణం లేకుండా ఏపీ మనుగడ సాగించదు: జీవీఎల్
సర్జికల్ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్‌షో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

