Ramnath Kovind : సిమ్లా పర్యటనలో రాష్ట్రపతి కోవింద్
Ramnath Kovind : మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వచ్చారు. ప్రత్యేక ఆర్మీ హెలీకాప్టర్‌లో వచ్చిన కోవింద్‌కు ...

సిమ్లా : మూడు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ (Ramnath Kovind) హిమాచల్‌ప్రదేశ్ రాజధాని సిమ్లాకు వచ్చారు. ప్రత్యేక ఆర్మీ హెలీకాప్టర్‌లో వచ్చిన కోవింద్‌కు హిమాచల్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి జైరాం ఠాకూర్ ఘనంగా స్వాగతం పలికారు. కుటుంబసభ్యులతో వచ్చిన కోవింద్.. సిమ్లాలో పలు అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా సిమ్లాను నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. ఈ మూడు రోజులు విమానాలతోపాటు డ్రోన్ల వాడకంపై నిషేధం విధించారు. 1500 మందికి పైగా పోలీసు, సీఐడీ, ఆర్మీ సిబ్బందిని మోహరించారు.
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు అతడి కుటుంబంలోని 20 మంది సభ్యులు సిమ్లా పర్యటనకు వచ్చారు. వీరి వెంట 23 మంది సిబ్బంది కూడా ఉన్నారు. కోవింద్ పర్యటన నేపథ్యంలో భద్రత కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రదేశాల్లో జామర్ వాహనాలను మోహరించారు. ప్రతి 100 మీటర్ల దూరంలో ఒక పోలీసు గార్డును పెట్టారు. రాష్ట్రపతి సెప్టెంబర్ 16 రోజంతా విశ్రాంతి తీసుకుంటారు. రేపు ఉదయం 11 గంటలకు శాసనసభకు చేరుకుని సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. రాత్రి 7 గంటలకు ఆయన రాజ్‌భవన్‌కు వెళ్లి తన గౌరవార్ధం గవర్నర్ ఇచ్చే విందులో పాల్గొంటారు. మరుసటి రోజు ఉదయం 11 గంటలకు యారోస్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. 19 న ఉదయం 11 గంటలకు ఢిల్లీకి తిరిగి వెళ్తారు.
ఇవి కూడా చదవండి..
ప్రపంచంలో తొలి ఫొటోకాపీయింగ్ ఎప్పుడో తెలుసా?
డెలివరీ బాయ్ అవతారమెత్తిన అమితాబ్ బచ్చన్.. ఎందుకంటే..?
అమెరికాపై మరోసారి అల్ ఖాయిదా దాడికి అవకాశం.. ఇంటెలిజెన్స్ నివేదిక
సర్జికల్ మాస్క్‌లతోనే కరోనా కట్టడి సాధ్యం!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో శివ్ త్యాగం.. గోట్ ఆఫ్ స్పీడ్‌గా నిలిచిన త్రిగుణ్
Medigadda | నేడు మేడిగడ్డకు బీఆర్ఎస్ బృందం.. బరాజ్‌ను పరిశీలించనున్న హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఎమ్మెల్యేలు
DK Shivakumar | ‘మెటా గ్లాసెస్’తో నాపై స్టింగ్ ఆపరేషన్‌కు యత్నం.. పారిశ్రామికవేత్తతో భేటీపై డీకే అనుమానం
Vidadala Rajini | ఏపీలో విడదల రజినీపై పోలీసుల అరాచకం.. మాజీ మంత్రిని కిందపడేసి ఎస్సై దాష్టీకం
Revanth Reddy | సొంత ఎమ్మెల్యేలపై నిఘా అస్త్రం.. ఫోన్లలో ట్రాకింగ్ యాప్‌లు, గన్మెన్లతో నిఘా పెడతామని సీఎం రేవంత్ వార్నింగ్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

