China Super Computer : బయటపడ్డ చైనా సీక్రెట్.. చాలా ఏళ్లుగా బయటపడనివ్వలేదు
China Super Computer : ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్ను చైనా సిద్ధం చేసింది. ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని డ్రాగన్ సీక్రెట్‌గా...

బీజింగ్ : (China Super Computer) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం సూపర్ కంప్యూటర్ను చైనా సిద్ధం చేసింది. ఈ కంప్యూటర్ తయారీ విషయాన్ని డ్రాగన్ సీక్రెట్‌గా ఉంచింది. ఈ క్వాంటం సూపర్ కంప్యూటర్ను సీక్రెట్ ల్యాబ్‌లో తయారుచేయడంలో చైనా శాస్త్రవేత్తలు విజయం సాధించినట్లు సమాచారం. ఈ కంప్యూటర్ ఆశ్చర్యకరమైన వేగాన్ని కలిగి ఉన్నట్లుగా తెలుస్తున్నది.
ప్రపంచంలోనే మొట్టమొదటి ‘ఎక్స్ఫ్లాప్’ క్వాంటం పీసీని నిర్మించినట్లు చైనా నేషన్వైడ్ సూపర్ కంప్యూటింగ్ పరిశోధకులు పేర్కొన్నారు. ఈ యంత్రాన్ని చాలా ఏండ్లుగా ఎవరి కండ్లలో పడకుండా శాస్త్రవేత్తలు దాచి ఉంచారు. అలాగే, ప్రపంచంలోనే అత్యంత బలమైన, వేగవంతమైన కంప్యూటర్ను నిర్మిస్తున్నదని ఇప్పటివరకు ఎవరికీ తెలియదు. ఈ వీసీ సాయంతో భూమిపై ఉన్న సాంప్రదాయిక కంప్యూటర్ సిస్టంల కంటే 100 ట్రిలియన్ సంఖ్యలను ఆవలీలగా గుణించే అవకాశాలు ఉన్నట్లు పరిశోధకులు చెప్తున్నారు. మానవ సృజనాత్మకత కంటే వేగవంతంగా పనిచేయడం ఈ పీసీ ప్రత్యేకత. ఈ పీసీ తయారీకి దాదాపు ఎనిమిది సంవత్సరాల సమయం పట్టినట్లుగా భావిస్తున్నారు. చాలా ఏండ్లుగా క్వాంటం కంప్యూటర్ సిస్టమ్‌లను తయారుచేసేందుకు వివిధ దేశాల పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. అయితే, అందరికన్నా ముందుగా చైనా ఈ విజయాన్ని అందుకున్నది.

రానున్న 10-15 సంవత్సరాలలో క్వాంటం కంప్యూటర్ సిస్టంలను క్రిప్టాలజీ సబ్జెక్ట్‌లోని వాస్తవ సమస్యలను పరిష్కరించేందుకు ఉపయోగించుకోవచ్చని ఆశిస్తున్నట్లు క్వాంటం పీసీని సృష్టించిన శాస్త్రవేత్త ఝూ తెలిపారు. ఈ క్వాంటం కంప్యూటర్ సిస్టంలు భవిష్యత్‌లో 1000 మంది వ్యక్తులు అందించే భారీ స్థాయి సైన్స్ కార్యక్రమాలకు, సూపర్ స్మార్ట్ సింథటిక్ ఇంటెలిజెన్స్‌కు శక్తిని అందించడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి..
ఒకటి, రెండు, మూడు సార్లు కాదు.. ఒకేసారి 20 లాటరీ ప్రైజ్‌లు కొట్టాడు
బద్వేల్ ఉప ఎన్నిక కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి
ఘనంగా వైఎస్సార్ అవార్డుల ప్రదానోత్సవం
ఏపీలో మిగిలిన స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్.. ఎల్లుండి నుంచి నామినేషన్లు
వైద్యరంగంలో మానవ వనరుల కొరతను అధిగమిద్దాం: వెంకయ్యనాయుడు
శీతాకాలంలో గుండెపోటును ఇలా నివారించండి
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Science-technology News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

